Begin typing your search above and press return to search.
టీఎస్‌పీఎస్‌సీ క్వశ్చన్ పేపర్లలోనూ కవిత హస్తం.. ఆర్ఎస్‌పీ ఆరోపణ
By: Tupaki Desk | 23 March 2023 8:00 AM GMTఉన్న లిక్కర్ కేస్ చాలదన్నట్లు టీఎస్‌పీఎస్‌సీ క్వశ్చన్ పేపర్ల లీకజీ వ్యవహారంలోనూ కవిత పేరు వినిపిస్తోంది ఇప్పుడు. తాజాగా బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కవిత పాత్ర ఉందంటూ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో కవిత పాత్ర కూడా ఉందంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఇప్పటికే బండి సంజయ్, ఇతర నాయకులు కేటీఆర్ ప్రమేయంపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, బండి సంజయ్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఆరోపణలు చేస్తే అవి రాజకీయంగా చేసే విమర్శలుగానే జనం చూశారు. కానీ, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కవితపై ఆరోపణలు చేయడంతో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి.
మిగతా నాయకుల్లా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నోటికొచ్చినట్లు మాట్లాడే రకం కాదని.. మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకపోవచ్చన్న చర్చ తెలంగాణలో వినిపిస్తోంది.
కాగా ప్రవీణ్ కుమార్ తన ట్వీట్లో ఓ విషయం ప్రస్తావించారు. ప్రస్తుతం టీఎస్‌పీఎస్‌సీ సభ్యురాలిగా ఉన్న తనోబా గతంలో తెలంగాణ జాగృతి మెదక్ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారని ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు.
ఈ ప్రశ్నపత్రాల కుంభకోణంలో ఎవరికెన్ని అమ్ముడుపోయాయో అంటూ ఆయన అనుమానం వ్యక్తంచేశారు. పేపర్ లీకేజ్ వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయించాలని ప్రవీన్ డిమాండ్ చేశారు.
కాగా టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంతో ఇప్పటికే యువత, నిరుద్యోగులలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నట్లు కవిత హస్తం ఉండడం కానీ, ఆమె అనుచరుల హస్తం కానీ ఉండడం నిజమే అయితే అది కేసీఆర్ కుటుంబానికి మరింత మచ్చగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటుండడంతో ప్రజల్లో కేసీఆర్ కుటుంబ ప్రతిష్ఠ మసకబారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.