Begin typing your search above and press return to search.

కేఏ పాల్ క్వశ్చన్‌కు ఆన్సర్ ఉందా కవితా?

By:  Tupaki Desk   |   10 March 2023 9:41 AM GMT
కేఏ పాల్ క్వశ్చన్‌కు ఆన్సర్ ఉందా కవితా?
X
తెలంగాణలో ఇప్పుడు ఒకటే టాపిక్ వినిపిస్తోంది.. అది దిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిండా కూరుకుపోయిన కవిత అంశం. కేంద్రంలోని బీజేపీ పనిగట్టుకుని ఈ విషయంలో కవితను ఇరికించిందని.. ఆమెకు ఏ పాపమూ తెలియదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. పైగా కవిత కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ దిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ధర్నాకూ రెడీ అవుతున్నారు.

అయితే.. కవితకు మొత్తం తెలంగాణ అండగా ఉందంటూ కవిత, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు అంటుండడంతో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ భారీ కౌంటర్ వేశారు. కవితకు అంత మద్దతే ఉంటే ఎన్నికలలో ఎందుకు ఓడిపోయారో చెప్పాలని ప్రశ్నించారు. తమను ఎవరు ప్రశ్నించినా... ఎవరు ఏ ఆరోపణ చేసినా అమాంతం బీఆర్ఎస్ అంతా వారి మీదపడిపోయి నోరుమూయించడం చాలాకాలంగా చూస్తున్నాం.. అయితే, కేఏ పాల్ అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం కేసీఆర్, కేటీఆర్ సహా ఏ బీజేపీ నేత దగ్గరా లేదు.

కాగా ఈ రోజు కవిత, కేటీఆర్‌ల ప్రెస్ మీట్ తరువాత మాట్లాడిన కేఏపాల్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు. కవిత, కేటీఆర్‌లలో తీవ్రమైన భయం కనిపిస్తోందని పాల్ అన్నారు. ప్రజాస్వామ్యం గురించి నిత్యం మాట్లాడే కేటీఆర్ తెలంగాణలోని మీడియా సంస్థలను బ్యాన్ చేస్తామని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు.

తనను ఇంట్లోనే విచారించాలని కవిత ఈడీని అడుగుతున్నారని.. కానీ, సోనియా గాంధీ లాంటివారే ఈడీ కార్యాలయానికి వెళ్లి వచ్చారని కేఏ పాల్ అన్నారు. కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ ధనిక రాష్ట్రం నుంచి పేద రాష్ట్రంగా మారిపోయిందని చెప్పారు. కేసీఆర్ తొలి కేబినెట్లో ఒక్క మహిళకూ చోటివ్వలేదని..

ఇప్పుడు కవిత ఏ ముఖం పెట్టుకుని మహిళా సమస్యలపై ప్రశ్నిస్తారని పాల్ అన్నారు.తెలంగాణ ప్రజల మద్దతు తనకే ఉందని కవిత చెప్తున్నారని.. అలాంటప్పుడు నిజామాబాద్‌లో ఎందుకు ఓడిపోయారో చెప్పాలని ప్రశ్నించారు. న్యాయం కవిత వైపు లేదని తేల్చేశారు పాల్. అంతేకాదు... దైవం కూడా కవిత పక్షాన లేదని... కేవలం పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే కవిత వైపు ఉన్నారని అన్నారాయన.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.