Begin typing your search above and press return to search.
హాట్ టాపిక్ గా మారిన కావలి డీఎస్పీ వెంకటరమణ బ్యాక్ గ్రౌండ్ ఇదేనట
By: Tupaki Desk | 13 May 2023 12:10 PM GMTసంచలనంగా మారిన కావలి డీఎస్పీ వెంకటరమణ వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారారు. నిన్నటి వరకు ఆయన ఎవరన్న విషయంపై అవగాహన లేని ఉన్నతాధికారులు సైతం ఆయన గురించి.. ఆయన బ్యాక్ గ్రౌండ్ గురించి ఆరా తీస్తున్నారు. ఇక.. బీజేపీ నేతలు అయితే రగిలిపోతున్నారు. కేంద్రంలో తాము అధికారంలో ఉన్నామన్న విషయాన్ని సైతం పట్టించుకోకుండా తమ విషయంలో ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఆయన విషయంలో చర్యలు వేగవంతంగా ఉండాలన్న డిమాండ్ అన్ని స్థాయిల్లో వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉంటే.. ఇంతకూ వెంకటరమణ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? గతంలో ఆయన పోస్టింగ్ ఎక్కడ ఉండేది? ఇటీవల చేసిన బదిలీల్లో కావలికి వచ్చేలా వెనుక ఉండి నడిపించిందెవరు? లాంటి ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. ఆర్నెల్ల క్రితం వరకు తిరుపతి స్పెషల్ బ్రాంచిలో పని చేస్తూ.. కావలిలో లా అండ్ ఆర్డర్ కు సంబంధించిన సబ్ డివిజనల్ పోలీసు అధికారిగా ఆయన చేరినట్లు చెబుతున్నారు.
కావలి లా అండ్ ఆర్డర్ కు వచ్చిన వెంకటరమణ గురించి స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం లేదని చెబుతారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే సైతం గుర్రుగా ఉన్నారని చెబుతారు. అయితే.. వెంకటరమణకు డీజీపీ ఆశీస్సులు ఉన్నాయని చెబుతున్నారు.
అంతకు ముందున్న డీఎస్పీ మీద కావలికి చెందిన మాజీ ఎమ్మెల్యే.. ప్రస్తుతం ఉదయగిరి పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నేత ఒకరు ప్రత్యేకంగా చొరవ చూపటంతో ఆయన్ను పక్కన పెట్టి.. వెంకటరమణను తెచ్చారంటారు.
స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా స్పెషల్ బ్రాంచి నుంచి వెంకటరమణను తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ డీఎస్పీగా కావలి రావటం.. ముఖ్యమంత్రి పర్యటనలో మాట రాకుండా చూడాలన్న అత్యుత్సాహంతో వ్యవహరించిన ఆయన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
డీజీపీకి మాట రాకుండా చూడాలన్న తపన.. విచక్షణ మిస్ అయ్యేలా చేసిందంటున్నారు. స్థానిక నేతల్ని కంట్రోల్ చేయటం డీఎస్పీ స్థాయి అధికారులకుపెద్ద పనేం కాదు. కానీ.. అదేమీ లేకుండా వెనుకా ముందు చూసుకోకుండా వ్యవహరించిన తీరే ఇప్పుడు ఆయనకు తిప్పలు తెచ్చి పెట్టిందంటున్నారు. స్వామిభక్తిని ప్రదర్శించాలనుకోవటం మంచిదే కానీ.. అందుకు విపక్ష నేతల పట్ల అంత కర్కశంగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది.