Begin typing your search above and press return to search.
కమలం పార్టీని రక్షించని కశ్మీర్
By: Tupaki Desk | 24 Oct 2019 1:00 PM GMTమహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలను ఆర్టికల్ త్రీ సెవెన్టీ రద్దు శాసిస్తుందని కొందరు అంచనా వేశారు. భారతీయ జనతా పార్టీ వాళ్లు ఇటీవలే ఆ ఆర్టికల్ ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలో అధికారాన్ని ఉపయోగించుకుని బీజేపీ ఆ పని చేసింది. తద్వారా వెనువెంటనే వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రభావం గట్టిగా ఉంటుందని చాలా మంది అనుకున్నారు.
అలాగే పోలింగ్ కు ముందు రోజు పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఆర్మీ దాడులు చేసింది. అది కూడా ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర నాయకత్వం చేయించిందనే ప్రచారమూ జరిగింది. ఉగ్రవాద మూకలపై దాడులు ఎప్పుడైనా చేయవచ్చు. అయితే పోలింగ్ కు ముందు రోజు చేయడంలో ఉద్దేశం ఏమిటని కాంగ్రెస్ వాళ్లు ప్రశ్నించారు. అవన్నీఎన్నికల జిమ్మిక్కులు అని అభిప్రాయపడ్డారు.
ఆ సంగతేమో కానీ.. అటు కశ్మీర్ కు ప్రత్యేక అధికారణ కల్పించిన ఆర్టికల్ థ్రీ సెవెన్టీ రద్దు కానీ, ఇటు ఉగ్రవాద స్థావరాలపై మరోసారి జరిగిన మెరుపుదాడులు కానీ ప్రజల్లో బీజేపీ బలాన్ని పెంచలేకపోయాయని పరిశీలకులు అంటున్నారు.
మహారాష్ట్రలో బీజేపీ చాలా సీట్లను చేజార్చుకుంది. హర్యానాలో ఆల్మోస్ట్ అధికారాన్నే కోల్పోయింది. ఎలాగోలా ప్రభుత్వం అయితే ఏర్పడవచ్చు. అయితే బీజేపీ వ్యతిరేక వర్గాలు ఈ రాష్ట్రాల్లో బాగా పుంజుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆర్టికల్ త్రీ సెవెన్టీ రద్దు, మిలటరీ దాడులు బీజేపీకి పెద్దగా పొలిటికల్ మైలేజీ ఇవ్వలేదని విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పుడు మోడీ ముందు వేరే సవాళ్లున్నాయి. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోందని మేధావులు వాపోతున్నారు. సామాన్యులు కూడా అందుకు సంబంధించి ప్రతిబంధకాలను ఎదుర్కొంటూ ఉన్నారు. దేశాన్ని ఇప్పుడు మాంద్యం దిశంగా వెళ్లకుండా నివారించడం మోడీ ముందున్న అతి పెద్ద లక్ష్యం. ఆ పని చూడమన్నట్టుగా ఉన్నాయి ఈ ఎన్నికల ఫలితాలు.