Begin typing your search above and press return to search.
#KarnatakaElectionResults : ఎగ్జిట్ పోల్స్ ప్రకటించినట్టుగానే వస్తున్నాయి!
By: Tupaki Desk | 13 May 2023 10:30 AM GMTకర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించినట్టుగానే వస్తున్నాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే మెజారిటీ వస్తుందని పేర్కొనగా తాజాగా ఫలితాల ట్రెండ్ కూడా అలాగే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏకంగా 115 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. చివరి వరకు ఇవే ఫలితాలు కొనసాగితే ఆ పార్టీ అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ 78 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక కుమారస్వామికి చెందిన జేడీఎస్ 26 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మరో ఐదు చోట్ల స్వతంత్రులు ఆధిక్యంలో ఉన్నారు.
కాగా కర్నాటక సీఎం బసవరాజ బొమ్మై సొంత జిల్లాలో ఆయనకు షాక్ ఎదురైంది. బొమ్మై సొంత జిల్లా అయిన హవేరిలో 6 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఐదు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే ఉన్నారు. మిగిలిన ఒక్క స్థానం షిగ్గావ్ లో బొమ్మై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
అలాగే కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ పేరుతో కర్ణాటక ఎన్నికల్లో బరిలోకి దిగిన గాలి జనార్దన్ రెడ్డి గంగావతి స్థానంలో, ఆయన భార్య గాలి అరుణ బళ్లారిలో వెనుకంజలో ఉన్నారు. ప్రతి రౌండుకు ఈ రెండు స్థానాల్లో ఆధిక్యం మారుతూ వస్తోంది. ఒక రౌండులో గాలి దంపతులు ఉంటే మరో రౌండులో కాంగ్రెస్ అభ్యర్థులు లీడింగ్ లో ఉంటున్నారు. బీజేపీకి చెందిన సీనియర్ నేత బి.శ్రీరాములు వెనుకంజలో ఉన్నారు.
ఇక కనకపురలో కర్ణాటక పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్, వరుణలో మాజీ సీఎం సిద్ధరామయ్య ముందంజలో ఉన్నారు. హుబ్లీ–ధార్వాడ్ స్థానంలో బీజేపీ రెబల్ నేత, ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరి పోటీ చేసిన మాజీ సీఎం జగదీష్ శెట్టార్ వెనుకంజలో కొనసాగుతున్నారు.
ఇక తాము కింగ్ మేకర్ కాదని.. తామే కింగ్ అని ప్రకటించకున్న జేడీఎస్ ముఖ్య నేత, మాజీ సీఎం కుమారస్వామి చెన్నపట్టణలో వెనుకపడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉండటంతో ఆ పార్టీ అప్రమత్తమైంది. తమ ఎమ్మెల్యేలను శిబిరాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తోంది. జేడీఎస్ సైతం ఇప్పటికే హైదరాబాద్ లో స్టార్ హోటళ్లను బుక్ చేసినట్టు సమాచారం. పార్క్ హయత్, తాజ్ కృష్ణా, తాజ్ బంజార హోటళ్లలో లగ్జరీ రూమ్ లను బుక్ చేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఫలితాలను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఢిల్లీ నుంచి పరిశీలిస్తున్నారు. ప్రియాంకా గాంధీ సిమ్లాలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
కర్ణాటకలో బీజేపీ ఓటమికి నందిని వర్సెస్ అమూల్ పాల వ్యవహారం, 40 శాతం కమీషన్ల అవినీతి ప్రభుత్వం తదితర అంశాలు ముఖ్య కారణాలుగా నిలుస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక కాంగ్రెస్ విజయానికి రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర ప్రధాన కారణమని అంటున్నారు.