Begin typing your search above and press return to search.

విధేయ‌త‌కు వీర‌తాడు.. 69 ఏళ్ల‌వ‌య‌సులో మంత్రి ప‌ద‌వి.. క‌ర్ణాట‌క స్పెష‌ల్‌

By:  Tupaki Desk   |   21 May 2023 5:00 AM GMT
విధేయ‌త‌కు వీర‌తాడు.. 69 ఏళ్ల‌వ‌య‌సులో మంత్రి ప‌ద‌వి.. క‌ర్ణాట‌క స్పెష‌ల్‌
X
క‌ర్ణాట‌క‌లో 136 స్థానాలు ద‌క్కించుకుని అఖండ విజ‌యాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. తాజాగా అనేక త‌ర్జ‌న భర్జ‌నల అనంత‌రం ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్య‌మంత్రిగా.. సిద్ద‌రామ‌య్య‌ను ఎంపిక చేసిన అధిష్టానం..అ దేస‌మ‌యంలో విధేయ‌త‌కు వీర‌తాళ్లు వేసింది. పార్టీకి.. అధిష్టానానికి విధేయులుగా ఉన్న‌వారిని మ‌రిచిపోకుండా.. ప‌ద‌వులు అప్ప‌గించింది. వీరిలో ప్రముఖంగా నిలిచారు.. రామ‌లింగారెడ్డి. ఈయ‌న వ‌య‌సు 69 ఏళ్లు. నిజానికి ఈయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు.

కానీ, పార్టీ ప‌ట్ల‌.. పార్టీ నేత‌ల ప‌ట్ల ఆయ‌న‌కు ఉన్న‌విధేయ‌త‌.. అంద‌రికీ అందుబాటులో ఉండ‌డం.. అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం వంటి కార‌ణాల‌తో రామ‌లింగారెడ్డికి కాంగ్రెస్ అదిష్టానం పెద్ద పీట వేసింది. దాదాపు ఎనిమిది ఎన్నిక‌ల్లో రామ‌లింగా రెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆయ‌న పోటీ చేసిన చోట ఓట‌మి అనేది లేకుండా ముందుకు సాగారు. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బెంగళూరు సిటీలోని బీటీఎం లేఔట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు.

అయితే.. గ‌తంలో జ‌య‌న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూడా ఆయ‌న నాలుగు సార్లు విజ‌యం ద‌క్కించుకు న్నారు. సీనియర్ నాయకుడుగానే కాకుండా.. అత్యంత విధేయుడిగా కూడా ఆయ‌న పేరు తెచ్చుకున్నా రు. అంద‌రినీ క‌లుపుగోలుగా ముందుకు న‌డిపించే నాయ‌కుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

గ‌తంలోనూ మంత్రి ప‌ద‌వులు

గ‌తంలో కూడా రామ‌లింగారెడ్డికి మంత్రి ప‌ద‌వులు వ‌రించాయి. 1989లో మొదటి సారి జయనగర నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగా రెడ్డి 1992లో వీరప్ప మోయిలి ప్ర‌భుత్వంలో మంత్రి పీఠాన్ని ద‌క్కించుకున్నారు.

+ త‌ర్వాత ఎస్ఎం క్రిష్ణ క్యాబినెట్ లోనూ మంత్రిప‌ద‌విని ద‌క్కించుకున్నారు. ఈ కేబినెట్‌లో మ‌ధ్య‌లోనే చాలా మంది మంత్రుల‌ను మార్చినా రామలింగా రెడ్డి మాత్రం పూర్తి కాలం మంత్రి పదవిలో ఉన్నారు.

+ ధరంసింగ్ ప్రభుత్వంలో కూడా రామలింగా రెడ్డి మంత్రిగా పని చేశారు. 2013లో సిద్దరామయ్య సీఎం అయిన తరువాత 2018 వరకు కర్ణాటక హోమ్ మంత్రిగా, రవాణా శాఖా మంత్రిగా పని చేసిన రామలింగా రెడ్డి ఎలాంటి వివాదం లేకుండా అందరితో కలసిమెలసి ఉన్నారు. మొత్తంగా చూస్తే.. ఈ ద‌ఫా విధేయుల‌ను కాంగ్రెస్ విస్మ‌రించ‌లేద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.