Begin typing your search above and press return to search.
వార్తను ఫొటో తీయడం కాదు.. ఫొటోనే వార్తగా మారిన వేళ.. కాకరేపుతున్న ఏకైక ఫొటో
By: Tupaki Desk | 15 May 2023 7:58 PM GMTనిజానికి వార్తలకు.. ఫొటోలకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఒక వార్తను ఫొటో లేకుండా రాయొచ్చు. కానీ, నుదు టున తిలకం లేని ముత్తైదువుగా ఉంటుందని అనేవారు.. కేబి తిలక్. అయితే.. అనేక వార్తలు ఫొటోలు లేకుండానే వస్తున్నా యి. కానీ, కొన్ని కొన్ని ఫోటోలకు ప్రత్యేకంగా వార్తలు అవసరం లేదు. అవే.. వార్తను క్రియేట్ చేస్తాయి. వాటిని చదవరులు ఇట్టే అర్ధం చేసుకుంటారు. అందుకే.. దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఫొటో జర్నలిస్టులకు ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.
నిజానికి చెప్పాలంటే.. మన దగ్గరకంటే కూడా.. ప్రపంచ దేశాల్లోని అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే.. ఫొటో జర్నలిస్టులకు ఎన లేని ప్రాధాన్యం ఉంది. భారీ వేతనాలు ఇచ్చి మరీ తీసుకుంటుంటారు. ఒక్క ఫొటో కారణంగా.. డీజీపీని మార్చేసిన చరిత్ర పశ్చిమ బెంగాల్లో ఉంది. ఏపీలోనూ ఒక ఐఏఎస్‌ను వారం రోజుల పాటు సస్పెండ్ చేసిన హిస్టరీ కూడా ఉంది. ఫొటో జర్నలిజానికి ఉన్న శక్తి అలాంటిది. సరే.. ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. ఒకే ఒక్క ఫొటో.. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
ఈ ఫొటోను ముద్రించని.. చూపించని మీడియా లేదంటే అతిశయోక్తి కాదు. అదే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కిం చుకున్న తర్వాత.. సీఎం సీటు విషయంపై అక్కడి కాంగ్రెస్ నేతల మధ్య లోలోన రగులుతున్న ఆందోళనను ప్రతిబింబించే ఫొటో!! పైన చూపించిన ఫొటో అదే. సీఎం సీటును మాజీ సీఎం సిద్దరామయ్య, ప్రస్తుత కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌లు ఆశిస్తు న్నారు. అయితే.. ఇద్దరూ ఉద్ధండులే. ఇద్దరూ కావాల్సిన వారే. దీంతో కాంగ్రెస్‌కు ఇది తేల్చడం తలనొప్పిగా మారింది. సరే.. ఏదో ఒక ఫార్ములా అయితే కనిపెడతారు.
ఈ విషయం ఇలా ఉంటే.. సిద్దరామయ్య ఒకవైపు.. డీకే మరోవైపు కూర్చోగా.. మధ్యలో ఖాళీగా ఉన్న కుర్చీవైపు ఇద్దరూ చూస్తున్న ఫొటో ఇప్పుడు దేశ వ్యాప్తంగా జోరుగా వైరల్ అవుతోంది. ప్రతి మీడియా సంస్థా(చిన్నా పెద్ద) ఈ ఫొటోను అచ్చేశాయి. వాస్తవానికి ఇది.. ఇప్పుడు తీసిన ఫొటో కాదు. భారత్ జోడో యాత్ర సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ కోసం వేసిన కుర్చిని అప్పటి ఫొటో గ్రాఫర్ క్లిక్‌మనిపించారు. ఆ ఫోటోనే ఇప్పుడు హాట్‌గా మారింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సదరు ఫొటో గ్రాఫర్ కోసం వెతుకుతుండడం గమనార్హం.