Begin typing your search above and press return to search.

ఇండియాలో మూసేస్తామంటూ ఫేస్ బుక్ కు కోర్టు వార్నింగ్

By:  Tupaki Desk   |   15 Jun 2023 3:03 PM GMT
ఇండియాలో మూసేస్తామంటూ ఫేస్ బుక్ కు కోర్టు వార్నింగ్
X
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోందనే చెప్పాలి. అందులోనూ ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ఇలా ప్రతి ఒక్కరూ వాడుతుంటారు. అయితే సోషల్ మీడియా దిగ్గజం... ఫేస్ బుక్ గురించి అందరికీ తెలిసిందే. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సోషల్ మీడియా దిగ్గజానికి కర్ణాటక హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. అదేంటి అనుకుంటున్నారా...?

అసలు విషయం ఏమిటంటే... భారతదేశంలో ఫేస్‌ బుక్‌ ను మూసివేస్తామని కర్ణాటక హైకోర్టు వార్నింగ్‌ ఇచ్చింది. దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు సమీపంలోని బికర్నకట్టె నివాసి కవిత సమర్పించిన పిటిషన్‌ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఈ వార్నింగ్ ఇచ్చింది.

సౌదీ అరేబియాలో ఖైదు చేయబడిన భారతీయ పౌరుడి కేసు దర్యాప్తులో రాష్ట్ర పోలీసులకు సహకరించడం లేదని ఆరోపించిన నేపథ్యంలో భారత దేశంలోని ఫేస్ బుక్ కార్యకలాపాలను మూసివేయడానికి ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది.

ఇదీ జరిగింది... దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు సమీపంలోని బికర్నకట్టె నివాసి కవిత సమర్పించిన పిటిషన్‌ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఫేస్ బుక్ కు వార్నింగ్ ఇచ్చింది. 2019లో పౌరసత్వ సవరణ చట్టం , నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కు మద్దతుగా ఫేస్‌ బుక్‌ లో మెసేజ్ పెట్టాడని, అయితే గుర్తు తెలియని వ్యక్తులు తన పేరుతో నకిలీ ఫేస్‌ బుక్ ఖాతా తెరిచి రాజుపై అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఆమె చెప్పారు. విషయం తెలిసిన వెంటనే కుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా కవిత మంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే, సౌదీ పోలీసులు శైలేష్ కుమార్‌ ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. దర్యాప్తు చేపట్టిన మంగళూరు పోలీసులు ఫేస్‌ బుక్‌ కు లేఖ రాసి... నకిలీ ఫేస్‌ బుక్ ఖాతా తెరిచినట్లు సమాచారం అందించారు. అయితే, ఫేస్‌ బుక్ మాత్రం పోలీసుల లేఖ పై స్పందించలేదు. 2021లో విచారణలో జాప్యాన్ని ప్రశ్నిస్తూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తను జైలు నుంచి విడుదల చేయాలని కవిత కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు.

ఆమె వేసిన పిటిషన్ను విచారణ చేపట్టిన కోర్టు... సమాచారంతో కూడిన పూర్తి నివేదికను ఒక వారంలోగా కోర్టు ముందు సమర్పించాలి” అని బెంచ్ ఫేస్‌ బుక్‌ ను ఆదేశించింది. తప్పుడు కేసులో భారతీయ పౌరుడిని అరెస్టు చేసిన కేసులో ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వాలని పేర్కొంది.