Begin typing your search above and press return to search.
బీఆర్ఎస్ కు కర్ణాటక ఫీవర్
By: Tupaki Desk | 19 April 2023 10:00 PM GMTతెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం బీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇదే సమయంలో జాతీయ రాజకీయాల్లో పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను పరిచయం చేయాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆరాటపడుతున్నారు. అయితే గతంలో తాము నేరుగా పోటీ చేస్తామని ప్రకటించినప్పటికీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిత్రపక్షమైన జేడీఎస్ కు మద్దతు ఇవ్వడమే కరెక్ట్ అని గులాబీ నేతలు అనుకుంటున్నారు.
అందుకే ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఇదే సమయంలో ఆ రాష్ట్రంలో ఒకవేళ కాంగ్రెస్ లేదా బీజేపీ అధికారంలోకి వచ్చే సూచన కనిపిస్తే ఆ తరువాత తెలంగాణలో కేసీఆర్ రూట్ మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణలో జరుగుతాయి. అయితే అంతకంటే ముందే కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనని స్థానిక పార్టీల కంటే బీఆర్ఎస్ కే గుబులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కర్ణాటకలు వచ్చిన ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
ఇక్క కాంగ్రెస్ లేదా బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలోని సదరు పార్టీని కట్టడి చేయాలని చూస్తున్నారు. ఒకవేళ హంగ్ ఏర్పడితే మాత్రం జేడీఎస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు.
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ లను రెండు వైపులా కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పోటా పోటీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయితే రెండు పార్టీలు తమంటే తామే అధికారంలోకి వస్తాయని నమ్ముతున్నాయి. అయితే కర్ణాటకలో ఒకవేళ మరోసారి బీజేపీ వస్తే దక్షిణాదిన బీజేపీ హవా సాగుతుందని ఆ పార్టీ నాయకులు తెలంగాణలో ప్రచారం చేసుకోనున్నారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ప్రజలు మార్పును కోరుతున్నారని, వచ్చేది కాంగ్రెస్ రాజ్యమేనని ప్రజల్లోకి వెళ్తారు. ఈ రెండు పార్టీలో కర్ణాటక ఎన్నికల ఫలితాలను వాడుకోనున్నారు.
కానీ అంతకంటే ముందే బీఆర్ఎస్ బిగ్ ప్లాన్ చేస్తోంది. కర్ణాటక ఫలితాల ఆధారంగా బీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. ఈ రెండు పార్టీల్లో ఏదీ కర్ణాటకలో గెలిచినా బీఆర్ఎస్ కు మైనస్ గా మారే అవకాశం ఉంది.
అందువల్ల ఆ పార్టీ లు గెలవకుండా కర్ణాటకలో బీఆర్ఎస్ ప్రచారం చేయనుంది. ఒకవేళ హంగ్ ఏర్పడితే మాత్రం తాము కర్ణాటకలో పాగా వేశామని, జాతీయ రాజకీయాల్లో ఇక బీఆర్ఎస్ కు బీజం పడిందని కేసీఆర్ ప్రచారం చేయనున్నారు. కానీ ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉన్నారు.