Begin typing your search above and press return to search.

కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ : కాంగ్రెస్ కు ఆధిక్యం.. లేదంటే హంగ్

By:  Tupaki Desk   |   10 May 2023 7:12 PM GMT
కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ : కాంగ్రెస్ కు ఆధిక్యం.. లేదంటే హంగ్
X
కర్ణాటక ఎన్నికల్లో పోలింగ్ ముగియడంతో ఇప్పుడు వివిధ జాతీయ మీడియాలు, ప్రాంతీయ మీడియా సంస్థలు కర్ణాటకలో చేసిన సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ ను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా పేర్కొన్నాయి. రెండో స్థానంలో బీజేపీ ఉంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోందని తెలిపాయి.

ఇక అనుకున్నట్టే ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తున్న జేడీఎస్ ఈసారి కూడా కింగ్ మేకర్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. పోయిన సారి కూడా ఇలానే కుమారస్వామి సీఎంగా అయ్యారు. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి కూడా హంగ్ అసెంబ్లీ అన్న అంచనాలు రావడంతో అందరూ డోలాయమానంలో పడ్డారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తాయి. సాయంత్రం 5 గంటల వరకూ 65.69 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.

మొత్తం కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగ్గా.. ఈనెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

-ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవీ

- టీవీ9 భారత్ వర్ష్ ఎగ్జిట్ పోల్స్:

బీజేపీకి 88-98 సీట్లు, కాంగ్రెస్ కు 99-109, జేడీఎస్ కు 21-26, ఇతరులు 0-4

-జీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్

బీజేపీకి 79-94 సీట్లు, కాంగ్రెస్ కు 103-118, జేడీఎస్ కు 25-33, ఇతరులు 2-5

-రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్

బీజేపీకి 85-100, కాంగ్రెస్ 94-108, జేడీఎస్ 24-32,. ఇతరులు 2-6

-పోల్ స్ట్రాట్

బీజేపీకి 88-98, కాంగ్రెస్ 99-109, జేడీఎస్ 21-26, ఇతరులు 0-4

-న్యూస్ నేషన్ - సీజీఎస్ సర్వే :

బీజేపీ 114, కాంగ్రెస్ 86, జేడీఎస్ 21, ఇతరులు 3

-సువర్ణ న్యూస్- జన్ కీ బాత్ సర్వే

బీజేపీ 94-117, కాంగ్రెస్ 91-106, జేడీఎస్ 14-24, ఇతరులు 0-2 చొప్పున సీట్లు