Begin typing your search above and press return to search.

మూడురోజులుగా వెయిట్ చేస్తున్న మంత్రి... రివేంజ్ తప్పదన్న కె.కాంగ్రెస్!

By:  Tupaki Desk   |   24 Jun 2023 9:00 AM GMT
మూడురోజులుగా వెయిట్ చేస్తున్న మంత్రి... రివేంజ్ తప్పదన్న కె.కాంగ్రెస్!
X
ఎన్నికల వేళ పొద్దస్తామనం కర్ణాటకలోనే ఉన్న బీజేపీ కేంద్రంపెద్దలు.. ఈ రోజు కర్ణాటక మంత్రి హస్తినలో భేటీకోసం పడిగాపులు పడుతుంటే పట్టించుకోవడం లేదని ఫైరవుతున్నారు కాంగ్రెస్ నేతలు. అపాయింట్ మెంట్ ఇచ్చి రమ్మని పిలిచి మరీ మూడురోజులుగా వెయిట్ చేయిస్తున్నారని మండిపడుతున్నారు. రివేంజ్ తప్పదని హెచ్చరిస్తున్నారు.

అవును... కేంద్ర మంత్రిని కలవడానికి మరో కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుతం కర్ణాటకలో మంత్రిగా ఉన్న కేహెచ్. మునియప్ప మూడు రోజుల పాటు వేచి చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 7 సార్లు వరుసగా ఎంపీగా విజయం సాధించి, కేంద్ర మంత్రిగా పని చేసిన కేహెచ్. మునియప్ప ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి సిద్దరామయ్య ప్రభుత్వంలో మంత్రి అయ్యారు.

ఇందులో భాగంగా... కర్ణాటక ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఉచిత బియ్యం పంపిణి పథకంపై చర్చించేందుకు హస్తిన వెళ్లారు మంత్రి మునియప్ప. అయితే ఈ సందర్భంగా ఆయనకు అపాయింట్ మెంట్ ఇచ్చి కూడా మూడురోజులుగా టైం చెప్పకుండా తాత్సారం చేస్తున్నారంట బీజేపీ నేతలు.

దీంతో ఈవిషయాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ నేతలు బీజేపీని లాజికల్ గా కొడుతున్నారు.

కర్ణాటక ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బియ్యం పంపిణి పథకంపై చర్చించే సమయం లేదా? లేక మీకు కాంగ్రెస్ పార్టీ హామీలు నచ్చలేదా? ప్రధాని నకేంద్ర మోదీకి కర్ణాటకలోని ప్రజల సమస్యలు పట్టించుకోవడం ముఖ్యమా, కాదా? ఎన్నికలు సమయంలో మూడు రోజులకోసారి ప్రచారం కోసం ఢిల్లీ నుంచి పరిగెత్తుకుని వచ్చి వీధుల్లో చెయ్యి ఊపిన మోడీకి ఇప్పుడు కర్ణాటక ప్రజల సమస్యలు గుర్తుకు రావడంలేదా? బీజేపీని గెలిపించలేదని కర్ణాటక ప్రజలపై బీజేపీ నేతలు కక్ష సాధిస్తున్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

ఈ సందర్భంగా.. ఇలాంటి వైఖరి కనబరుస్తున్న బీజేపీ నేతల తీరుని మిగిలిన రాష్ట్రాల ప్రజలు కూడా గుర్తించాలని సూచిస్తున్నారు. అనంతరం... కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుతం కర్ణాటక మంత్రిగా ఉన్న కేహెచ్. మునియప్ప లాంటి సీనియర్ నాయకుడికి జరిగిన అవమానానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.