Begin typing your search above and press return to search.
సోనియా ఇంటి ముందు సిద్ధూకు అవమానం!
By: Tupaki Desk | 27 May 2023 1:22 PM GMTఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలో విజయకేతనం ఎగురవేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు కావాల్సి ఉండగా అంతకంటే ఎక్కువ సీట్లు సాధించి ఎవరి మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఫలితాల వెల్లడి తర్వాత నాలుగైదు రోజులు దోబూచులాట జరిగాక ఎట్టకేలకు సిద్ధరామయ్య మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా వీరిద్దరితోపాటు తొలి విడతలో 8 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మలి విడత విస్తరణ కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మంత్రివర్గ విస్తరణపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో చర్చించడానికి ఇప్పటికే పలుమార్లు వారిద్దరు ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలో మొత్తం 24 మంది పేర్లకు సోనియా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మొత్తం 24 మందిని మంత్రులుగా చేయడానికి సోనియా అనుమతి ఇచ్చారు.
కాగా ఈ క్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సోనియాగాంధీ నివాసం వద్ద అవమానం జరిగిందనే వార్త హల్చల్ చేస్తోంది. సోనియా అనుమతి కోసం ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన కారులో ఆమె ఇంటికి బయలుదేరారు.
ఈ క్రమంలో సోనియా గాంధీ ఇంటి గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కర్ణాటక సీఎం సిద్దరామయ్య కారును అడ్డుకున్నారని తెలుస్తోంది. సిద్ధరామయ్యను వారు గుర్తు పట్టలేదని సమాచారం. కారులో కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఉన్నారని, ఆయన లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలసి సీఎం భద్రతా సిబ్బంది చెప్పినా సోనియా సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదని వార్తలు వచ్చాయి. దీంతో సిద్ధరామయ్య భద్రతా సిబ్బంది సోనియా గాంధీ పీఏకు ఫోన్ చేసి చెప్పడంతో వారి జోక్యంతో సిద్ధరామయ్యను లోపలకు పంపడానికి సోనియా భద్రతా సిబ్బంది అనుమతించారని తెలుస్తోంది.
సిద్ధరామయ్య కారును సోనియా సిబ్బంది చాలా సేపు బయటే ఆపేశారని.. ఆయనకు తీవ్ర అవమానం జరిగిందని కన్నడ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ విషయంపై అటు సిద్ధరామయ్య కానీ, సోనియా వైపు నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.