Begin typing your search above and press return to search.
కండక్టర్ అవతారం ఎత్తిన సీఎం... శక్తి స్టార్ట్ అయ్యింది!
By: Tupaki Desk | 11 Jun 2023 5:05 PM GMTఎన్నికల్లో గెలవాలంటే.. గెలిచి నిలవాలంటే.. హామీలు చాలా కీలకం. ఎలాంటి హామీలు ఇస్తున్నాం.. ఆ హామీలు ప్రజలపై ఏ స్థాయిలో ప్రభావం చూపగలుగుతుంది అనేది మరీ ముఖ్యం. అయితే ఆ హామీలను ప్రజలు నమ్మి అధికారం అప్పగించిన తర్వాత వాటిని నిబలెట్టుకోవడం అత్యంత ముఖ్యం. అయితే ఈ విషయంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగానూ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చడంలో కూడా సక్సెస్ అవుతుంది!
"ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం" అనేది కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీకి ఎంతో సహకరించిన హామీగా చెబుతున్నారు విశ్లేషకులు. అయితే తాజాగా "శక్తి" పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పథకం ప్రకారం... లగ్జరీ, ఏసీ బస్సులు మినహా... మిగిలిన అన్ని బస్సుల్లోనూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
బెంగళూరు సిటీ బస్సులతో పాటు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కె.ఎస్. ఆర్టీసీ), బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (ఎన్.డబ్ల్యూ.ఆర్టీసీ), నార్త్ ఈస్ట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఈశాన్య ఆర్టీసీ) బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే ఈ పథకం ఇవ్వాళ్టి నుంచి కర్ణాటక రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది.
అవును.... బెంగళూరులో విధానసౌధ వద్ద ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో కలిసి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య కండక్టర్ అవతారం ఎత్తారు. ఆయనే స్వయంగా మహిళా ప్రయాణికులకు ఫ్రీ పాసులను జారీ చేశారు.
ఈ సందర్భంగా... "శక్తి" పథకం లోగోను సీఎం ఆవిష్కరించారు. ఈ పథకం ప్రకారం... కర్ణాటకలో ఏ మూల నుంచి ఏ మూలకైనా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని చెబుతూ... ప్రయాణ సమయంలో ఆధార్ కార్డ్, ఓటరు కార్డు లేదా కర్ణాటకలో నివసిస్తోన్నట్లు రుజువు చేసే ఇతర ఏ గుర్తింపు కార్డునయినా కండక్టర్ కు చూపించాల్సి ఉంటుందని తెలిపారు. ఇలా మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చిన బస్సుల్లో 50 సీట్లను పురుషుల కోసం రిజర్వ్ చేశారు.