Begin typing your search above and press return to search.

నోట్ల కట్టలతో సహా దొరికిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కొడుకు

By:  Tupaki Desk   |   3 March 2023 7:00 PM GMT
నోట్ల కట్టలతో సహా దొరికిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కొడుకు
X
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికార బీజేపీకి అనుకోని షాక్ తగిలింది. అది కూడా అలాంటి ఇలాంటిది కాదు. భారీ డ్యామేజ్ కు గురి చేసే ఈ వ్యవహారం రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతోంది. భారీగా లంచం తీసుకుంటూ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అడ్డగా బుక్ అయ్యాడు. నోట్ల కట్టలతో సహా దొరికిన ఈ ఉదంతానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను సంచలనంగా మారింది.

ఒక టెండరుకు సంబంధించి కాంట్రాక్టర్ నుంచి రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ బీజేపీ ఎమ్మెల్యే పుత్రరత్నం దొరికిపోయారు. దీంతో.. వారింట్లో జరిగిన తనిఖీల్లో ఏకంగా రూ.6 కోట్ల నోట్ల గుట్టలు బయటకు వచ్చాయి. కర్ణాటకలోని దావణగెరె జిల్లా చెన్నగిరి ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్. తన తండ్రికి ఉన్న అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని పెద్ద ఎత్తున దందాలు చేస్తున్నాడు.

ముడి వస్తువుల కొనుగోలుకు సంబంధించిన టెండర్ ను ఇప్పిస్తానని చెప్పి.. ఒక కాంట్రాక్టర్ నుంచి రూ.40 లక్షలు తీసుకున్నారు. ఈ అవినీతి రాకెట్ ను లోకాయుక్త అధికారులు బద్ధలు కొట్టారు. ఈ ఎమ్మెల్యే పుత్రరత్నం ప్రశాంత్ బెంగళూరు జలమండలి కార్యాలయంలో చీఫ్ అకౌంటెంట్ గా వ్యవహరిస్తుంటారు. టెండర్ ఎపిసోడ్ లో రూ.80 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లుగా చెబుతున్నారు.

అయితే.. తనకు రూ.80 లక్షల లంచం ఇవ్వటం ఇష్టం లేని బాధితుడు లోకాయుక్తకు సమాచారం అందించాడు. దీంతో వారు రంగంలోకి దిగారు. పక్కా సమాచారాన్ని అందుకున్న వారు.. ప్రశాంత్ ఇంటికి ఆకస్మికంగా వచ్చి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా నోట్ల కట్టలు బయటపడటం.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియలో ఇప్పుడువైరల్ గామారాయి.

లోకాయుక్త అధికారులకు అడ్డంగా బుక్ అయిన ప్రశాంత్ తండ్రి కమ్ ఎమ్మెల్యే విరుపాక్షప్ప గురించి వస్తే.. ఆయన కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జంట్స్ లిమిలెడ్ కు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆయనకు తాజా ఉదంతం భారీ షాకింగ్ అని చెబుతున్నారు.

ఎమ్మెల్యే కుమారుడ్ని అదుపులోకి తీసుకున్న అధికారులు ఆఫీసులో రూ.1.7 కోట్ల భారీ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఇంట్లో నిర్వహించిన నేపథ్యంలో రూ.6కోట్ల లబించాయి. ఇంత భారీ మొత్తం బయటపడటంతో అతన్ని అరెస్టు చేశారు. ఈ ఉదంతం అధికార బీజేపీకి ఇబ్బందికరంగా మారిందని చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.