Begin typing your search above and press return to search.
కన్నా విందు రాజకీయం ఫలిస్తుందా?
By: Tupaki Desk | 27 March 2023 1:07 PM GMTబీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలి నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేసి మాజీ మంత్రి, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దశాబ్దాల తరబడి ఉమ్మడి గుంటూరు జిల్లాలో కన్నాతో విభేదిస్తూ వస్తున్న సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. కన్నాను ఓడిస్తామని రాయపాటి సంచలన ప్రకటన చేశారు.
ఈ నేపథ్యంలో కన్నా తన ఆపరేషన్ కు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన రికార్డు ఉన్న కన్నా లక్ష్మీనారాయణ తనదైన రాజకీయాలకు తెరతీశారు. గుంటూరు జిల్లాలో టీడీపీలో కీలకంగా ఉన్న నేతలకు ఆయన మార్చి 26న ఆదివారం గుంటూరులో విందు ఇచ్చారు. ఈ విందుకు తన ప్రత్యర్థి రాయపాటి సాంబశివరావు సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ అయిన రాయపాటి శ్రీనివాస్ కూడా హాజరవ్వడం విశేషం.
అంతేకాకుండా మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, వైవీ ఆంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, కొమ్మాలపాటి శ్రీధర్ తదితరులు ఈ విందు సమావేశానికి హాజరయ్యారు.
వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ, సత్తెనపల్లి, పెదకూరపాడు.. ఈ మూడు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి కన్నా ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయం. ముఖ్యంగా సత్తెనపల్లి నుంచి పోటీ చేయడానికి కన్నా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తరచూ ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సత్తెనపల్లి నుంచి టీడీపీ తరఫున పోటీ చేయడానికి నలుగురు నేతలు ఇప్పటికే క్యూ లో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు, తెలుగు యువత నేత మల్లి పోటీలో ఉన్నారు. అయితే కన్నా టీడీపీలో చేరి సత్తెనపల్లి సీటును తనకు ఇచ్చేలా చంద్రబాబు నుంచి హామీ పొందారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ కీలక నేతలందరినీ కన్నా తన విందుకు ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల నాటికి తనకు వ్యతిరేకత లేకుండా చేసుకోవడానికి ఆయన ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారని అంటున్నారు. మరి కన్నా విందు రాజకీయం ఫలిస్తుందో, లేదో వేచిచూడాల్సిందే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.