Begin typing your search above and press return to search.
కన్నా టీడీపీ నుంచి పోటీ చేసేది ఈ నియోజకవర్గం నుంచే!
By: Tupaki Desk | 20 Feb 2023 4:12 PM GMTబీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడం ఖాయమైందని టాక్ నడుస్తోంది. ఫిబ్రవరి 23న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరతారని చెబుతున్నారు. ఈ మేరకు కన్నా తన అనుచరులు, శ్రేయోభిలాషులు, స్నేహితులతో గుంటూరులో సమావేశమై కూలంకషంగా చర్చించారు. ఎక్కువమంది టీడీపీలో చేరాలని సూచించడంతో ఆయన ఆ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారని అంటున్నారు.
కాగా కన్నా లక్ష్మీనారాయణ గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి 1989, 1994, 1999, 2004ల్లో విజయం సాధించారు. 2009లో గుంటూరు పశ్చిమ నుంచి గెలుపొందారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగానూ పనిచేశారు. 2014లో గుంటూరు పశ్చిమ నుంచి కన్నా ఓటమి పాలయ్యారు.
ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విధానాలు నచ్చక కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరికకు సిద్ధమవుతున్నారు. కాగా కన్నా సత్తెనపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని అంటున్నారు.
కొద్ది రోజుల క్రితం వరకు జనసేనతో పొత్తులో భాగంగా సత్తెనపల్లి సీటును ఆ పార్టీకి కేటాయిస్తారనే చర్చ జరిగింది. అందులోనూ జనసేనాని పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేస్తుండే అంబటి రాంబాబు వైసీపీ తరఫున సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఓడించాలని జనసేన శ్రేణులు కంకణం కట్టుకున్నాయి. ఇప్పటికే జనసేన శ్రేణులకు, అంబటి రాంబాబు మధ్య తీవ్ర వాదులాట సత్తెనపల్లిలో చోటు చేసుకుంటోంది.
ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ తరఫున సత్తెనపల్లి సీటును కన్నాకు కేటాయించాలని టీడీపీ నిర్ణయిస్తే రెండు పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు కాపు సామాజికవర్గానికి చెందినవారే అవుతారు. అటు కన్నా లక్ష్మీనారాయణ, ఇటు అంబటి రాంబాబు ఇద్దరూ కాపు సామాజికవర్గానికి చెందినవారే. మరోవైపు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి కన్నా పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తున్నప్పటికీ సత్తెనపల్లి నుంచే ఆయన బరిలో దిగొచ్చని అంటున్నారు.
బీజేపీతో టీడీపీ పొత్తు కుదిరితే కన్నా బీజేపీలోనే కొనసాగాలనుకున్నారని టాక్. పొత్తులో భాగంగా గుంటూరు పశ్చిమ లేదా పెదకూరపాడు లేదా సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే టీడీపీతో పొత్తుకు బీజేపీ ససేమిరా అంటోంది. చివరి వరకు బీజేపీ .. టీడీపీతో పొత్తుకు మొగ్గుచూపుతుందని కన్నా భావించారని టాక్. అయితే బీజేపీ ఈ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో కన్నా తన భవిష్యత్ కోసం ఆ పార్టీకి రాజీనామా చేశారని టాక్.
మరోవైపు జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఎన్నికల నాటికి బీజేపీ కూడా తమతోపాటు కలసి రాకుంటే పవన్ ఆ పార్టీకి గుడ్ బై చెప్తారని టీడీపీతో కలసి నడుస్తారని టాక్. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని ఇప్పటికే పలుమార్లు పవన్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో జనసేన, టీడీపీ, బీజేపీ కలసి పోటీ చేయాలనేది పవన్ యోచన అంటున్నారు. ఒక వేళ బీజేపీ కలసి రాకుంటే టీడీపీతో వెళ్లనున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇటు టీడీపీలో చేరితే తనకు సీటు ఖాయమని కన్నా లక్ష్మీనారాయణ లెక్కలు వేసుకున్నారని సమాచారం. మరోవైపు టీడీపీ తరఫున సత్తెనపల్లి టికెట్ ను నలుగురు అభ్యర్థులు ఆశిస్తుండటం గమనార్హం. టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు వైవీ ఆంజనేయులు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగబాబు, తెలుగు యువత నాయకుడు అబ్బూరు మల్లి వీరిలో ఉన్నారు. మరి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోనున్నారో త్వరలోనే తేలనుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.