Begin typing your search above and press return to search.
ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేగారూ..నిజాలు తెలుసుకోవాలి
By: Tupaki Desk | 3 Dec 2019 6:40 AM GMTప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పై కనిగిరి మాజీ జెడ్పీటీసీ వర్గం పనిగట్టుకుని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తోంది. మా ఆన్ లైన్ వెబ్ పోర్టల్ గత 12-13 ఏళ్ల నుండి అగ్ర స్థానంలో ఉంది. ఎన్నో స్టోరీస్ దైర్యంగా చెప్పడం జరిగింది. ఏంతో మంది రియల్ టైం రిపోర్టర్స్ అండ్ స్ట్రింగర్స్ తో నడుపుతున్నాము..మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆ రోజు పోస్ట్ చేయడం జరిగింది.
మాజీ జెడ్పీటీసీ అనుచర గణం, బంధువర్గం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అదే పనిగా పదే పదే తుపాకీ నెట్ వర్క్ రిపోర్టర్లకు ఇతర దేశాల నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వేర్వేరు నెంబర్ల నుంచి కాల్ చేస్తూ ఎమ్మెల్యే గురించి వ్యతిరేక ఫిర్యాదులు ఇస్తూ వస్తున్నారు. ఆధారాలు లేకపోవడంతో మీడియా చాలా సార్లు పట్టించుకోలేదు. కానీ అత్యధిక కాల్స్ రావడంతో తుపాకి రిపోర్టర్లు కొందరు ఆ దుష్ ప్రచారం నమ్మి ఒక వార్తను పబ్లిష్ చేశారు. దానిని యాజమాన్యం గమనించి, ఆ తరువాత తొలగించింది.
ఇప్పటివరకు ఉత్తినే ఏ రాజకీయ నాయకుడి గురించి వ్యతిరేకంగా తుపాకి మీడియా ఉద్దేశ పూర్వకంగా కథనాలు ప్రచారం చేయలేదు. అయితే, ఇన్ని కాల్స్ రావడం వెనుక కారణం ఏంటా అని తుపాకి ఆరా తీస్తే... కనిగిరి మాజీ జెడ్పీటీసీ నీటి ట్యాంకర్ల విషయంలో బాగా అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిసింది. దీంతో కొందరు స్థానిక వైకాపా నాయకుల చిలక్కొట్టుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో వీరు తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఎమ్మెల్యేపై దుష్ప్రచారం మొదలుపెట్టినట్టు అర్థమైంది.
మనం మంచిగా ఉంటే సరిపోదు. మన చుట్టూ ఉన్న వారూ మంచిగా ఉండాలి. ప్రస్తుతం ఏపీలో అవినీతి అనేదే లేకుండా చేయాలనీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నో విన్నూత్నమైన చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి.. ఎంపీ.. ఎమ్మెల్యే.. స్థాయి ఏదైనా పట్టించుకోకుండా తనకు వచ్చే ఫిర్యాదుల మీద ఎంక్వయిరీ చేయించి.. తప్పు చేసినట్లు తేలితే వెంటనే వారిని మందలిస్తున్న వైనాలు ఇప్పటికే చాలా చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే కూడా ఇలాంటి వారి విషయంలో అలర్ట్ గా ఉండి కొంచెం కఠినంగా వ్యవహరించడం ద్వారా భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ప్రజాసేవలో ఉంటున్న ఎమ్మెల్యే తనకు వ్యతిరేకంగా వస్తున్న ఫిర్యాదుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. తప్పుడు ఫిర్యాదులు అయినా పదేపదే అందితే మీడియా కూడా ప్రభావితం అవుతుందనడానికి ఇదొక ఉధాహరణ. మీకు ఒక వేల బాధగా అనిపిస్తే తప్పకుండ ఖండిస్తాం అని తెలియజేస్తున్నాం. మా సైట్ లో లింక్ ఉంది మీ ఖండన పంపియవల్సిందిగా కోరడం అయ్యింది.