Begin typing your search above and press return to search.
కమల్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు
By: Tupaki Desk | 4 Nov 2017 5:55 PM GMTసినీ నటుడు కమల్ హాసన్ తనను విమర్శిస్తున్నవారిపై విరుచుకుపడ్డారు. విమర్శలను, వాస్తవాలను తట్టుకోలేనివారు ఇప్పుడు తనను చంపాలని కూడా కోరుకుంటారన్నారు. ‘‘వారిని ప్రశ్నిస్తే మమ్మల్ని దేశ ద్రోహులంటారు.. జైల్లో పెట్టాలనుకుంటారు. కానీ.. జైళ్లలో ఖాళీ లేదు కదా. అందుకే మమ్మల్ని కాల్చి చంపేయాలనుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు. తాను రీసెంటుగా చేసి హిందూ తీవ్రవాదం అన్న వ్యాఖ్యల నేపథ్యంలో అఖిల భారతీయ హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు అశోక్ శర్మ చేసిన సీరియస్ కామెంట్లపై స్పందించి కమల్ ఈ మాటలన్నారు.
కాగా కమల్ వ్యాఖ్యల దుమారం రోజురోజుకీ పెరుగుతుందే కానీ చల్లారడం లేదు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్లోని వారణాసి కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేశారు. మరోవైపు అశోక్ శర్మ మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కమల్ ను కాల్చి చంపాలని ఆయన పిలుపునిచ్చారు. హిందూ వ్యతిరేక ఎజెండాతో ముందుకు సాగుతున్న నాయకులే ఇలాంటి ప్రకటనలు చేస్తారని ఆరోపించారు. ఇలాంటి వారిని కాల్చిచంపడమే కరెక్టని ఆయనన్నారు. అంతేకాదు కమల్ హాసన్ సినిమాలను బహిష్కరించాలని కోరారు.
మరోవైపు కమల్ హాసన్ వ్యాఖ్యలపై బీజేపీ కూడా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అయితే ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు హాఫీజ్ సయీద్‌తో కమల్ ను పోల్చారు. అయితే.. కమల్ హాసన్‌కు మద్దతుగానూ కొందరు మాట్లాడుతున్నారు. నటుడు ప్రకాశ్ రాజ్ కూడా కమల్ కే మద్దతు పలికారు.