Begin typing your search above and press return to search.
చెన్నైకి కవిత.. బీఆర్ఎస్ రెండో రాష్ట్రంలోకి అడుగు..
By: Tupaki Desk | 10 Feb 2023 10:00 PM GMTజాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలని చూస్తున్న కేసీఆర్ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే తెలంగాణయేతర సభను నాందేడ్ లో నిర్వహించి చర్చకు దారి తీశారు. ఇప్పుడు మరో రాష్ట్రం తమిళనాడులో బీఆర్ఎస్ ను పరిచయం చేయనున్నారు. అయితే ఈసారి ఎమ్మెల్సీ కవితకు అవకాశం ఇచ్చారు. తమిళనాడులోని చెన్నైలో నిర్వహించే ఓ రాజకీయ చర్చా వేదికు కవిత వెళ్లనున్నారు. 2024లో ఏ పార్టీ గెలుస్తుందనే చర్చలో స్థానిక డీఎంకే, కాంగ్రెస్, బీజేపీ లతో పాటు బీఆర్ఎస్ నుంచి కవిత పాల్గొంటారు. ఈ చర్చలో బీఆర్ఎస్ ను పరిచయం చేయనున్నారు.
బీఆర్ఎస్ గా మారిన తరువాత ఇతర రాష్ట్రాల్లో గులాబీ జెండాను రెపరెపలాడించేందుకు కేసీఆర్ అనేక వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ప్రతీ రాష్ట్రంలో బహిరంగ సభ నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల వివిధ మార్గాల ద్వారా పార్టీని ప్రజలకు పరిచయం చేయనున్నారు. బీఆర్ఎస్ ఏర్పాటు కాకముందు కేసీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిశారు. అప్పుడు కేసీఆర్ వెంట కవిత కూడా ఉన్నారు. ఇక కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం హాజరయ్యే అవకాశం ఉంది. తమిళనాడుతో సత్సంబంధాలు కలగడంతో అక్కడ నిర్వహించే చర్చా వేదికకు బీఆర్ఎస్ కు ఆహ్వానం వచ్చిందని అనుకుంటున్నారు.
కవిత తమిళనాడు వెళ్లిన తరువాత ముందుగా ప్రముఖ సినీ నటుడు అర్జున్ నిర్మిస్తున్న ఆంజనేయ విగ్రహానికి పూజలు చేయనున్నారు. ఆ తరువాత ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహిస్తున్న '2024లో ఎవరు విజయం సాధిస్తారు?' అనే చర్చా వేదికలో పాల్గొననున్నారు.
ఇందులో డీఎంకీ ఎంపీ తిరుచ్చి శివ, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, బీజేపీ మహిళా మోర్చ జాతీయ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే వాసంతి శ్రీనివాసనన్, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ పాల్గొంటారు. వీరితో పాటు కవిత తన గళం వినిపించనున్నారు.
బీఆర్ఎస్ ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు ఈ చర్చలో వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతు బంధు, దళిత బంధు, తదితర సంక్షేమ పథకాలను ఇక్కడ పరిచయం చేయనున్నారు. భవిష్యత్ లో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశమంతా ఈ పథకాలు తీసుకొస్తారని చెబుతారని అంటున్నారు.
ఇది రాజకీయ చర్చ వేదిక అయినందున బీఆర్ఎస్ తన కార్యకలాపాలను దీని ద్వారా ప్రజలకు తెలుపుతారని అంటున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ కు తమిళనాడులో ఎంట్రీ ఇవ్వడానికి ఇదొక అవకాశంగా చెప్పుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.