Begin typing your search above and press return to search.
జంపింగ్ తో ఏకంగా సీఎం అయిపోయాడు
By: Tupaki Desk | 26 Feb 2016 6:01 AM GMTఒక పార్టీ నుంచి ఎన్నికైన ఒక ఎమ్మెల్యే మరోపార్టీలోకి వెళ్లటమే పెద్ద తప్పులా చూసే రోజులు పోయి చాలాకాలమే అయ్యింది. అలా పార్టీ జంప్ చేసి వచ్చే వారికి కీలక పదవులు కట్టబెట్టే సంప్రదాయం ఈ మధ్య వరకూ పెద్దగా లేదు. కానీ.. అలాంటి గీతల్ని చెరిపేసి జంపింగ్స్ కు సైతం పదవులు కట్టబెట్టే దూకుడు రాజకీయాలు ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. టీటీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్.. తెలంగాణ అధికారపక్షంలోకి చేరటమే కాదు.. మంత్రి పదవిని చేపట్టటం తెలిసిందే. పార్టీ మారి ఏకంగా మంత్రి పదవి చేపట్టారే అంటూ కిందామీదా పడిపోయిన పరిస్థితి. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.
ఎందుకంటే.. పార్టీ పిరాయింపుదారే ఏకంగా ముఖ్యమంత్రి అయిన పరిస్థితి. ఓపక్క గవర్నర్.. మరోపక్క బీజేపీ అండ పుణ్యమా అని ఫిరాయింపు దారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే పరిస్థితి నెలకొంది. ఇలాంటి అప్రజాస్వామిక విధానాల్ని సుప్రీంకోర్టు కూడా అడ్డుకోవటం సాధ్యం కాలేదు.
అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పిరాయింపుదారు అవతావరం ఎత్తటం.. ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేల మద్దుతుతో పాటు.. బీజేపీ.. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో మద్దతుతో కాలిఖో సీఎంగా ప్రమాణస్వీకారం చేయటమే కాదు.. తాజాగా అసెంబ్లీలో తన బలనిరూపణను పూర్తి చేసుకున్నారు. నేడు అరుణాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాలు రానున్న రోజుల్లో మరిన్ని రాష్ట్రాల్లోనూ చోటు చేసుకునే అవకాశం ఉందనటంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో..మరింతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రులు కానున్నారన్న మాట.