Begin typing your search above and press return to search.
మెడికోలే.. మత్తుకు బానిసలైతే..
By: Tupaki Desk | 29 Nov 2017 8:54 AM GMTమాదక ద్రవ్యాలు ఎంత చేటు చేస్తాయో అందరికీ తెలిసిందే. కొందరు తెలియక వాటి ఊబిలో చిక్కుకుంటున్నా.. మరికొందరు పనిగట్టుకుని వాటికి బానిసలవుతున్నారు. ఫలితంగా బాడీని, భవిష్యత్తును కూడా నాశనం చేసుకుంటున్నారు. మాదకద్రవ్యాలకు బానిసలుగా మారి.. ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేసుకుని పరువు పోగొట్టుకుని ఎవరికీ కొరగాని వ్యక్తులుగా సమాజానికి భారంగా బతుకులు ఈడుస్తున్నవారి సంఖ్యకు కొదవ లేదు. ఉన్నత వర్గాల నుంచి సామాన్యుల వరకు మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను సర్వస్వం నాశనం చేసుకున్న దాఖలాలు ఎన్నెన్నో ఉన్నాయి.
ఇక, హైదరాబాద్ వంటి కీలక నగరాల్లో మాదక ద్రవ్యాల వినియోగం ఇటీవల కాలంలో భారీ ఎత్తున పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ పోలీసులు, ఎక్సైజ్ దాడులు నిర్వహిస్తున్నా.. మాదక ద్రవ్యాల వినియోగం మాత్రం తగ్గలేదన్నది అధికారుల మాట! ఇక, ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలు విద్యార్థుల చెంతకు కూడా చేరిపోయాయి. అదికూడా భావి భారతాన్ని ఆరోగ్యంగా ఉంచాల్సిన వృత్తిని చేపట్టబోయే వైద్య విద్యార్థులు మత్తుకు బానిసలయ్యారు. తమను తాము మరిచిపోయారు. మత్తులో జోగుతూ.. తమ వృత్తినే అవమాన పరిచారు. చివరికి విషయం బయటకు పొక్కడంతో జీవితాలపై మచ్చలు పడి కుమిలిపోతున్నారు.
విషయంలోకి వెళ్తే.. తెలంగాణలో మంచి పేరు తెచ్చుకున్న కాకతీయ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థులు దారితప్పారు. ఓ మెడికో.. బర్త్‌డే పార్టీలో గంజాయిని యథేచ్ఛగా వినియోగించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 22 మంది మెడికోలు.. పార్టీ పేరుతో గంటల తరబడి గంజాయి తాగారు. ఇంకేముంది మత్తులో జోగుతూ.. అలానే ఉండిపోయారు. దీంతో విషయం తెలిసిన కళాశాల ప్రిన్సిపాల్.. 22 మందిని రెండు నెలల పాటు సస్పెండ్ చేశారు. ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటన స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం సృష్టించింది.