కాజల్ లో వెంకన్న తెచ్చిన మార్పు ఇది!

Mon Sep 26 2022 20:12:23 GMT+0530 (India Standard Time)

kajal at tirupati

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని  సినీ నటి కాజల్ అగర్వాల్ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో భర్త గౌతమ్ .. తల్లి వినయ్ అగర్వాల్‌తో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయవేద పండితులు వేదాశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ ప్రాంగణం నుండి గెస్ట్ హౌస్ వరకూ  నడిచే సమయంలో కాజల్  అభిమానులు  మీడియా తో ఇంటరాక్ట్ అయ్యింది.  ఈసందర్భంగా కాజల్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  తల్లి అయిన తర్వాత టాలీవుడ్‌లో  అవకాశాలు రాకుండా పోతాయనే భయం తనకు ఏనాడు లేదని తెలిపింది. తెలుగు సినిమాల వల్లే ఈ స్థాయిలో  ఉన్నానని..ఎప్పటికీ తెలుగు పరిశ్రమను మర్చిపోనంది. అయితే ఈ సమయంలో కాజల్ పూర్తిగా  తెలుగులోనే సంభాషించింది. వీలైనంత వరకూ తెలుగు భాషలోనే మాట్లాడేందుకు  ప్రయత్నించింది.

గతంలో తెలుగు లో మొదలు పెట్టి హిందీ..ఇంగ్లీష్ భాషల్లోకి వెళ్లిపోయేది. కానీ ఈసారి పూర్తిగా తెలుగులోనే మాట్లాడింది. కొన్ని సంవత్సరాల పాటు తెలుగు సినిమాలు చేసినా కాజల్ తెలుగులో మాట్లాడటం లేదని గతంలో చాలాసార్లు విమర్శలు ఎదుర్కుంది. ఆమెకు ముందు తర్వాత చాలా మంది హీరోయిన్లు వచ్చారు. చక్కగా తెలుగు నేర్చుకుని సంభాషించారు.

కానీ కాజల్ మాత్రం ఇంత కాలం తెలుగును లైట్ తీసుకుంది. ఇప్పుడు కెరీర్ చరమాంకానికి చేరుకునే సరికి తెలుగు భాషపైనా పట్టు సాంధించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కనిపిస్తుంది. మరి ఉన్నట్లుండి?  కాజల్ శ్రీవారిని దర్శించుకోవడం వెనుక ఓ బమలైన కారణం ఉందా?  ప్రస్తుతం భారతీయ 2 షూటింగ్ తిరుపతిలో జరుగుతోంది.  

ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. షూట్ లో భాగంగా కొద్ది  రోజులుగా తిరుపతిలోనే తిష్ట వేసింది. సమయం దొరకడంతో దేవుడు దర్శనం చేసుకున్నట్ల తెలుస్తోంది. ఈ సందర్భంగా కాజల్ ఎలాంటి మేకప్ లేకుండా కనిపించింది. కాజల్ అగర్వాల్  ని   అభిమానులను చుట్టుముట్టారు. అయినా కాజల్ చిరాకు పడలేదు. ఎంతో ఓపికగా సెల్పీలు కూడా ఇచ్చింది. ఈ మార్పులన్నీ కాజల్ లో కొత్తగానే కనిపిస్తున్నాయని ఓ నెటి జనుడు కామెంట్ చేసాడు.  

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.