Begin typing your search above and press return to search.

టీడీపీలోకి కడప ఎమ్మెల్యే ?

By:  Tupaki Desk   |   12 March 2016 7:30 AM GMT
టీడీపీలోకి కడప ఎమ్మెల్యే ?
X
కడప జిల్లాలో ప్రారంభమైన ఎమ్మెల్యేల వలసలు ఇంకా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి - జయరాములు చేరగా తాజాగా మరికొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కడప జిల్లాలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వైకాపాలో చేరుతా రంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. జిల్లా కేంద్రమైన కడప ఎమ్మెల్యే అమ్జాద్ పాషా వైసీపీ నుంచి టీడీపీలో చేరుతారని భారీగా ప్రచారమవుతోంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆయన్ను టీడీపీలోకి తెచ్చేలా బద్వేల్ కు సంబంధించిన ఒక నాయకుడు - హైదరాబాద్ లో ఉంటున్న ఓ మైనార్టీ నాయకుడు ఈ వ్యవహారానికి సంబంధించి చర్చలు జరిపినట్లు సమాచారం. ప్రతిపక్ష సభ్యులు గా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి చేసుకోలేక అప్పులతో సతమతమైయ్యే కంటే అధికార పార్టీలోకి చేరి అభివృద్థితో పాటు ఆర్థిక సమస్యలను తొలగించుకోవడానికి తెదేపాలోకి చేరేందుకు ఆయన రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఎన్నికల ముందు టిక్కెట్ల ఆశ చూపి కొంత ఖర్చు పెట్టుకోండని చెప్పి తీరా రంగంలోకి దిగాక భారీగా ఖర్చు చేయించారని, దీంతో అప్పు లు చేశామని... ఇప్పుడు అప్పులు పెరిగి ఇబ్బందులు పడుతున్నామని పాషా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కాబట్టి ఏ నాయకుడు వచ్చినా, ఏ కార్యక్రమం జరిగినా ఆయన జేబు నుంచే ఖర్చు పెట్టిస్తున్నారట.. దీంతో ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇటీవల లోకేశ్ కడప జిల్లా పర్యటనలో ఉన్న సందర్భంలోనే ఆ ఎమ్మెల్యే విజయవాడ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలవాల్సి ఉండగా అదే రోజు జగన్ జిల్లా కు రావడం తో ఆ ప్రయత్నానికి బ్రేక్‌ పడినట్లు ఆయనకు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి కొంత మైనార్టీ నాయ కుల కొరత ఉన్న దృష్ట్యా రాష్ట్రంలో మైనార్టీలను ఆకట్టుకోవడానికి ఆ ఎమ్మెల్యే ను దగ్గరకు చేర్చుకునేందుకు తెదేపా రాష్ట్ర నాయకత్వం ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. వైకాపా చేతిలో బలమైన వర్గంగా ఉన్న మైనార్టీలను ఆకర్షిస్తే భవిష్యత్తు లో ఆ పార్టీకి భారీగా దెబ్బకొట్టవచ్చునన్నది కూడా తెదేపా నేతల వ్యూహంగా కనిపిస్తోంది. ఆ నేపథ్యంలోనే పాషాను తీసుకోవడానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.