Begin typing your search above and press return to search.
పవన్ కల్యాణ్ ను కేంద్ర మంత్రిని చేస్తా: కేఏ పాల్
By: Tupaki Desk | 27 April 2023 12:02 PM GMTప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మళ్లీ ఏపీ రాజకీయాల్లో హల్చల్ చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసి ఆయన ఘోరంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేఏ పాల్ హడావుడి చేస్తున్నారు. ఇటీవల ఈ అంశంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో విశాఖలో భేటీ కూడా అయ్యారు. కేంద్ర ప్రభుత్వం తనకు అవకాశమిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కు తన సొంత నిధులు ఇస్తానన్నారు.
మరోవైపు పవన్ కల్యాణ్ పైనా కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీని మూసేసి పవన్ ప్రజాశాంతి పార్టీలో చేరాలన్నారు. అలా చేస్తే పవన్ ను కేంద్ర మంత్రిని చేస్తానని తెలిపారు. ఇప్పటికే తాను ఐదుగురికి కేంద్ర మంత్రి పదవులు ఇప్పించానన్నారు. పవన్ బీజేపీతో ఎందుకు అంటకాగుతున్నారని ప్రశ్నించారు. వాళ్లేమన్నా 1000 కోట్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఆరు నెలలు ఆగితే పవన్ కు తాను అంతకంటే ఎక్కువ ఇస్తానని హాట్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా అమరావతిలో కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ డ్యాన్సులు వేస్తే రాష్ట్రం అప్పులు తీరతాయా అని ప్రశ్నించారు.
ప్రజాశాంతి పార్టీ గుంటూరు జిల్లా కమిటీ ఏర్పాటు చేశామని.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది ఆన్ లైన్‌లో ప్రజాశాంతి పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తోందని ధ్వజమెత్తారు. తాను ఛారిటీ డబ్బులో ఒక్క రూపాయి కూడా పార్టీ కోసం ఖర్చు పెట్టడం లేదన్నారు.
ఐదేళ్లు అధికారంలో ఉండి రాజధానిని చంద్రబాబు ఎందుకు కట్టలేదని నిలదీశారు. బీజేపీ వాళ్లు ప్రజాదర్బార్ పెడతామని.. వైసీపీ ప్రభుత్వం పై చార్జిషీట్లు వేస్తామని ప్రజలను మోసం చేస్తున్నారని పాల్ మండిపడ్డారు.
రూ. 3.5లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ ను తక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారని ఆయన ప్రశ్నించారు. బిడ్ దాఖలు చేయడానికి తనను క్వాలి ఫై కాదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎందుకు డిస్ క్వాలి ఫై చేశారని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ కోసం తాను కోర్టులో పిల్ వేశానన్నారు. హైకోర్టు న్యాయమూర్తిని తనకు టైం కేటాయించమని వేడుకుంటున్నానన్నారు.
ప్రైవేటీకరణ చేస్తే స్టీల్ ప్లాంట్ లో 44 వేలమంది ఉద్యోగులు రోడ్డున పడతారన్నారు. తనను స్టీల్ ప్లాంట్‌లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అనుమతులు ఇస్తే ఆస్తులు అమ్మి స్టీల్ ప్లాంట్ కు కడతాననని పాల్ తెలిపారు.
చంద్రబాబు 5 లక్షల కోట్లు, జగన్ నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారని కేఏ పాల్ మండిపడ్డారు. చంద్రబాబు కొడుకును ముఖ్యమంత్రిని చేయటానికి, దోచుకున్న ఆస్తులు దాచుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుటుంబ పాలన, కుల పాలన మన కొద్దు అని కేఏ పాల్ హాట్ కామెంట్స్ చేశారు.
దేశంలో లక్షల కోట్లు దోచుకుంటే కేంద్ర మంత్రులు, వేల కోట్లు దోచుకుంటే ముఖ్యమంత్రులు, వందల కోట్లు దోచుకుంటే మంత్రులు అవుతున్నారని కేఏ పాల్ హాట్ కామెంట్స్ చేశారు.
గతంలో తాను అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫండ్స్ ఇచ్చానని గుర్తు చేశారు. తాను అధికారంలోకి వస్తే ప్రతి గ్రామానికి సర్పంచ్ ద్వారా కోటి రూపాయలు ఇస్తానని కేఏ పాల్ తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతానని వెల్లడించారు.
కాగా జేడీ లక్ష్మీనారాయణను ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించామని.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు కేఏ పాల్ తెలిపారు. పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయిలో కమిటీలు వేస్తున్నామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ముప్పై లక్షల మంది కమిటీ సభ్యులు ఉన్నారని వెల్లడించారు.