Begin typing your search above and press return to search.

నేను హిందువుగా పుట్టాను, హిందువుగానే చనిపోతాను: కేఏ పాల్

By:  Tupaki Desk   |   16 Feb 2023 5:36 PM GMT
నేను హిందువుగా పుట్టాను, హిందువుగానే చనిపోతాను: కేఏ పాల్
X
మీడియా దృష్టిని ఆకర్షించే అవకాశాన్ని ఎన్నడూ వదలుకోడు క్రైస్తవ మత ప్రచారకుడు కెఎ పాల్. ప్రతీ సందర్భంలోనూ మంచో, చెడో తాను మీడియాలో ఉండాలని కోరుకుంటాడు. అలాంటి చేష్టలే చేస్తాడు.తాజాగా క్రైస్తవ మత ప్రబోధకుడిగా వరల్డ్ ఫేమస్ అయిన కేఏ పాల్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. క్రైస్తవానికి ప్రాణమిచ్చే ఆయన నోట ఈ వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచాయి.

తాను హిందువుగా పుట్టానని, హిందువుగానే చనిపోతానని, అయితే యేసుక్రీస్తు అనుచరుడిని అని కేఏ పాల్ వెల్లడించడం విశేషం. కొండగట్టు ఆలయ అభివృద్ధికి తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.600 కోట్లు ప్రకటించడంపై కేఏ పాల్ స్పందిస్తూ కేసీఆర్ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. ఆలయ అభివృద్ధికి రూ.600 కోట్లను పన్ను చెల్లింపుదారుల సొమ్మును ప్రకటించడం ద్వారా కేసీఆర్‌ పరోక్షంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అమలు చేస్తున్నారని, బీఆర్‌ఎస్‌ అంటే బీజేపీ బీ-టీమ్‌ తప్ప మరొకటి కాదని కేఏ పాల్ ఆరోపించారు..

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన కుమార్తె, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితారావును అరెస్ట్ చేయకుండా కేసీఆర్ వ్యూహాత్మకంగా తప్పించుకున్నారు అని పాల్ అన్నారు.

కొండగట్టు అభివృద్ధికి రూ.600 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్‌పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేస్తామని కేఏ పాల్ తెలిపారు. కేసీఆర్ సెక్యులర్ వ్యక్తి అయితే తెలంగాణలో చర్చిలు, మసీదుల అభివృద్ధికి, పునరుద్ధరణకు నిధులు ఎందుకు ప్రకటించడం లేదు? అని పాల్ ప్రశ్నించారు.

ఫిబ్రవరి 17న జరగాల్సిన తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవాన్ని కేసీఆర్ ప్రభుత్వం వాయిదా వేయడంతో తెలంగాణలో కలెక్టరేట్ల ముట్టడిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధినేత ప్రకటించారు.

ఇలా క్రైస్తవవాది అయిన పాల్ తాను హిందువుగానే చస్తానన్న మాటలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.