Begin typing your search above and press return to search.

వివేకా హత్య గురించి పులివెందులలో పిల్లాడ్ని అడిగినా చెబుతాడట

By:  Tupaki Desk   |   2 March 2023 10:18 AM GMT
వివేకా హత్య గురించి పులివెందులలో పిల్లాడ్ని అడిగినా చెబుతాడట
X
కామ్రేడ్ కు కోపం వచ్చింది. తమకు కించిత్ అవకాశం ఇవ్వని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్ష నేతగా వ్యవహరించిన వేళలో.. కామ్రేడ్లతో కాస్త క్లోజ్ గానే మూవ్ అయిన ఆయన.. ఆ తర్వాత వారిని పట్టించుకోవటమే మానేశారన్న పేరుంది. ఇలాంటి వేళ.. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి హోదాలో మాట్లాడిన కె.రామక్రిష్ణ సంచలన వ్యాఖ్యలుచేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మాజీ మంత్రి.. ముఖ్యమంత్రి సొంత బాబాయ్ ను ఆయన నివాసంలోనే అత్యంత దారుణంగా హతమార్చిన వైనాన్ని ఆయనీ సందర్భంగా ప్రస్తావించారు. వైఎస్ వివేకానందను ఆయన నివాసంలోనే అత్యంత దారుణంగా హతమార్చిన వైనం గురించి మాట్లాడిన రామక్రిష్ణ.. "ముఖ్యమంత్రి సొంతూరు పులివెందులలో ఏ పిల్లోడిని అడిగినా చెబుతారు. వైఎస్ వివేకానందనుహత్య చేసిందెవరో" అంటూ కీలక వ్యాఖ్య చేశారు.

ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించటం కోసం ముఖ్యమంత్రి జగన్ నియంత పోకడలు తారాస్థాయికిచేరినట్లుగా ఆరోపించారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు మాత్రమే విజయం సాధించటానికి ఆయన వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పు పట్టారు. విజయం కోసం జగన్ సాగిస్తున్న నియంత పోకడలు తారాస్థాయికి చేరుకున్నారు. ఇంతలా దిగజారిన ముఖ్యమంత్రిని తాను రాష్ట్ర చరిత్రలోనే చూడలేదంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇంత ఘాటుగా మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.