Begin typing your search above and press return to search.

బాబు సింగ‌పూర్ మంత్రానికి చెక్ ప‌డేనా?

By:  Tupaki Desk   |   26 Feb 2017 8:48 AM GMT
బాబు సింగ‌పూర్ మంత్రానికి చెక్ ప‌డేనా?
X
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఎప్పుడు సింగ‌పూర్‌ - జ‌పాన్... అంటూ మ‌న రాష్ట్రాన్ని, దేశాన్ని త‌క్కువ చేసి మాట్లాడుతుంటారు. సింగ‌పూర్‌ - జ‌పాన్ దేశాలు ఏ మేర‌కు అభివృద్ధి చెందాయి? మ‌న‌మెక్క‌డున్నామంటూ ఆయ‌న చేస్తున్న కామెంట్లు మ‌న‌లను డైలామాలో ప‌డేయ‌డ‌మే కాదండోయ్‌... ఒక్కో సంద‌ర్భంలో చిర్రెత్తుకొచ్చేలానూ చేస్తుంటాయి. ఇక రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని కోసం గుంటూరు జిల్లాలోని మంగ‌ళ‌గిరి ప్రాంతాన్ని ఎంపిక చేసిన బాబు స‌ర్కారు దానికి అమ‌రావ‌తి అని పేరు పెట్టేసి... ఆ న‌గ‌రాన్ని ప్ర‌పంచంలోని మేటి న‌గ‌రాల్లో ఒక‌టిగా తీర్చిదిద్దుతాన‌ని బాకాలు ఊదుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నోటి నుంచి సింగ‌పూర్ మాట రాని సంద‌ర్భమంటూ ఉండ‌దంటే అతిశ‌యోక్తి కాదేమో.

ఇప్ప‌టికే అమ‌రావ‌తి న‌గ‌ర నిర్మాణ బాధ్య‌త‌ల‌ను సింగ‌పూర్ క‌న్సార్టియానికి అప్ప‌జెప్పేందుకు చంద్ర‌బాబు స‌ర్కారు నానా తంటాలు ప‌డుతోంది. అస‌లు మ‌న ద‌గ్గ‌ర లేనిదేమిటి?... వాళ్ల ద‌గ్గ‌ర ఉన్న‌దేమిటి? అన్న ప్ర‌శ్న‌ను వ‌దిలేసిన బాబు అండ్ కో... నిత్యం సింగ‌పూర్ మంత్రాన్నే ప‌ఠిస్తోంది. ఈ క్ర‌మంలో మొన్న‌, నిన్న విజ‌య‌వాడ‌లో జ‌రిగిన అంత‌ర్జాతీయ న్యాయ‌స‌ద‌స్సుకు ముఖ్య అతిథులుగా హాజ‌రైన సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ మ‌ద‌న్ బీ లోకూర్‌ - జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ - ఢిల్లీ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రోహిణి త‌దిత‌రులు అస‌లు సింగ‌పూర్ న‌మూనాలు ఏ మేర‌కు మ‌న‌కు న‌ప్పుతాయ‌న్న విష‌యాన్ని విడ‌మ‌ర‌చి చెప్పారు. స‌ద‌స్సులో భాగంగా మాట్లాడిన ప‌లువురు న్యాయ‌వాదులు, రాజ‌కీయ నేత‌లు మ‌న న్యాయ వ్య‌వ‌స్థ‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడారు.

మ‌న దేశంలో ఒక్కో కేసు 300 ఏళ్ల పాటు కూడా విచార‌ణ ద‌శ‌లోనే ఉంటున్నాయ‌ని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అదే సింగ‌పూర్‌లో కోర్టు గ‌డ‌ప తొక్కిన అనితి కాలంలోనే ఆయా కేసులు ప‌రిష్కార‌మ‌వుతున్నాయ‌ని కూడా వారు ప‌రాయి దేశ న్యాయ వ్య‌వ‌స్థ‌ను ఆకాశానికెత్తేశారు. వారి మాట‌ల‌న్నింటినీ ఓపిగ్గా విన్న జ‌స్టిస్ మ‌ద‌న్ బీ లోకూర్‌... అస‌లు సింగ‌పూర్ న్యాయ‌వ్య‌వ‌స్థ స్వ‌రూపం గురించి పూర్తిగా వివ‌రించడంతో అప్ప‌టిదాకా మాట్లాడిన వారంతా నోరెళ్ల‌బెట్ట‌డ‌మే కాదండోయ్‌... మ‌న న్యాయ‌వ్యవ‌స్థ‌ను ఇంత‌గా కించ‌ప‌రిచామా? అన్న అప‌రాధ భావ‌న‌లో కూరుకుపోయారు. ఎప్పుడూ సింగ‌పూర్‌ - జ‌పాన్ - అమెరికా న‌మూనాల‌పై మాట్లాడే మ‌న‌కు అస‌లు ఆ దేశాల్లో ఉన్న ప‌రిస్థితుల గురించి మీకు తెలుసా అంటూ జ‌స్టిస్ లోకూర్ సంధించిన ప్ర‌శ్న‌ల‌కు నోట మాట రాలేద‌ట‌.

సింగ‌పూర్ న‌మూనాల‌ను వ‌దిలేసి సొంత న‌మూనాల‌ను ఏర్పాటు చేసుకోవాలంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు... అప్ప‌టిదాకా మ‌న న్యాయ వ్య‌వ‌స్థ‌ల‌ను కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేసిన వారికి మొట్టికాయ‌లు వేసిన‌ట్లుగానే ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. జ‌స్టిస్ లోకూర్ కేవ‌లం సింగ‌పూర్ న్యాయ వ్య‌వ‌స్థ గురించే మాట్లాడినా... ప్ర‌తి విష‌యంలో ఇత‌ర దేశాల‌ను గొప్ప‌గా కీర్తిస్తూ... మ‌న‌ల‌ను మ‌నం కించ‌ప‌రుచుకునేలా వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌న్న అర్థం వ‌చ్చేలా ఆయ‌న బాబు స‌ర్కారుకు చుర‌క‌లంటించార‌నే వాద‌న కూడా లేక‌పోలేదు. ఎప్పుడూ ఇత‌ర దేశాల‌ను పొగిడే మ‌నం... అక్క‌డున్న ప్ర‌తికూల‌త‌ల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే... మ‌న వ్య‌వ‌స్థ‌లు ఎంత గొప్ప‌వో అర్థ‌మ‌వుతాయ‌ని కూడా ఆయ‌న వేసిన పంచ్‌లు బాబు స‌ర్కారుకు నిజంగానే మొట్టికాయ‌లు వేస‌సిట్టుగానే భావించాలి. మ‌రి జ‌స్టిస్ లోకూర్ హెచ్చ‌రిక‌ల‌తోనైనా బాబు అండ్ కో మైండ్ సెట్ మారుతుందో... లేదో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/