Begin typing your search above and press return to search.
ప్రకాశ్ రాజ్ ఫైర్: ప్రశ్నిస్తే హిందూ వ్యతిరేకినా?
By: Tupaki Desk | 7 May 2018 7:44 AM GMTఇటీవల కాలంలో బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ తరచూ మీడియాలో దర్శనమిస్తున్నారు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్. బీజేపీ నేతలపైనా.. ప్రధాని మోడీపైనా ఆయన చేసే విమర్శలు కమలనాథులకు చిరాకు తెప్పిస్తుంటాయి. జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన సంధించే ప్రశ్నలు సూటిగా తగలటమే కాదు.. బీజేపీ నేతల గొంతులో పచ్చి వెల్లక్కాయ పడినట్లు అవుతున్న పరిస్థితి.
తాజాగా మరోసారి గళం విప్పారు ప్రకాశ్ రాజ్. బీజేపీ నేతల అబద్ధాలతో ప్రజల్ని కష్టాల్లో నెట్టేలా చేస్తున్నాయని మండిపడ్డారు. తాను ఏదైనా ప్రశ్నలు వేస్తే తనను హిందూ మత వ్యతిరేకిని అనటం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు.
తాను స్టార్ట్ చేసిన జస్ట్ ఆస్కింగ్ అన్నది రాజకీయ పార్టీ కాదని.. జస్ట్ ఆందోళన మాత్రమే అని చెప్పిన ప్రకాశ్ రాజ్.. అందరిని ప్రశ్నించే బాధ్యత తనకు ఉందన్నారు. ప్రధానమంత్రే ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టేలా పని చేస్తున్నారంటూ మండిపడిన ప్రకాశ్ రాజ్.. మైనార్టీలను దేశం నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
తనకు తాను దళితులకు ఆశాకిరణంగా చెప్పుకునే ప్రధాని మోడీ అబద్ధాలు చెబుతున్నారన్న మోడీ.. గనుల యజమానుల్ని క్షమించాల్సింది యడ్యురప్ప కాదని కర్ణాటక ప్రజలన్నారు. తాను చేసే పోరాటంలో దురుద్దేశం లేదని.. ఎలాంటి రాజకీయం అస్సలు లేదని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. ఒక్కొక్క మాట ఒక్కో ప్రశ్నగా మారి.. తాను వ్యతిరేకించే కమలనాథులకు కొత్త కష్టాలు తెస్తున్న ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.