Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో జూపల్లి...పొంగులేటి....డేట్ ఫిక్స్ !

By:  Tupaki Desk   |   26 Jun 2023 8:40 PM GMT
కాంగ్రెస్ లో  జూపల్లి...పొంగులేటి....డేట్ ఫిక్స్ !
X
తెలంగాణా కాంగ్రెస్ కి అన్నీ ఉన్నా అయిదవ తనమే లేదు అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ పార్టీకి గ్రౌండ్ లెవెల్ వరకూ క్యాడర్ ఉంది. బలం ఉంది. ఇపుడు కొత్తగా కర్నాటక ఎన్నికల తరువాత జోష్ పెరిగింది. జాయినింగ్స్ కూడా ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నాయి.

అదే సమయంలో పార్టీలో సీనియర్ల మధ్యన కూడా విభేదాలు పెరుగుతున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్లు గా కధ సాగుతూనే ఉంది అంటున్నారు. దానికి కారణం కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరుగుతోంది. అదే సమయంలో రేపటి ఎన్నికల తరువాత సీఎం పోస్టు వంటి వాటి మీద ఇప్పటి నుంచే చాలా మంది ఆశపడుతున్నారని అంటున్నారు.

ఖమ్మం జిల్లా విషయానికి వస్తే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ మేరకు ఆయన మజీ మంత్రి జూపల్లి క్రిష్ణా రావు తో కలసి కేంద్ర కాంగ్రెస్ పెద్దల తో మంతనాలు జరిపారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి క్రిష్ణారావు భేటీ అయ్యారు. ఢిల్లీ లోని ఏఐసీసీ కార్యాలయం లో దాదాపు అరగంట కు పైగా చర్చ నడిచిందని టాక్.

ఇక జూఅలి 2న ఖమ్మంలో జరిగే బహిరంగ సాభకు ఈ రావాలని రాహుల్ గాంధీని పొంగులేటి కోరినట్టు సమాచారం. దీని పై ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. ఆ సభ లోనే పొంగులేటి జూపల్లి కాంగ్రెస్ లో చేరుతారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కూడా పొంగులేటి జూపల్లి కలిసి చర్చలు జరుపుతారని అంటున్నారు. అలాగే ప్రియాంకా గాంధీని కూడా వారు కలుస్తారు అని తెలుస్తోంది.

ఇక ఖమ్మం కాంగ్రెస్ లో పొంగులేటి చేరిక మీద సీనియర్లు ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్నది ఒక చర్చగా ఉంది. ఖమ్మం ఎంపీ సీటు మీద కన్నేసిన మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అయితే పొంగులేటి పార్టీలో చేరడాన్ని స్వాగతించారు. కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని అందరూ పార్టీ లోకి వస్తున్నారు అని అంటున్నారు.

తాను ఎంపీ కి పోటీ చేస్తానో ఎమ్మెల్యేగా చెస్తానో అది అధినాయకత్వం ఇష్టమని ఆమె అంటున్నారు. ఎవరు పార్టీలో చేరినా అభ్యంతరం ఏమి ఉంటుంది అని ఆమె చెబుతున్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పాలిటిక్స్ లో రేణుక పొంగులేటి మధ్య సీటు కోసం ఏమైనా పోటీ ఉంటుందా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్ లో ఒక వైపు జోష్ కనిపిస్తూంటే మరో వైపు సీనియర్ల మధ్య మాత్రం గ్యాప్ అలాగే ఉంది అని అంటున్నారు. దీని కనుక సర్దుబాటు చేసుకోకపోతే పార్టీకి ఇబ్బందులే అని అంటున్నారు.