Begin typing your search above and press return to search.
లోకేష్ పాదయాత్ర.. షాకిచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు!
By: Tupaki Desk | 6 March 2023 11:13 AM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు 4 వేల కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే ఆయన చిత్తూరు జిల్లాలో పాదయాత్ర ముగించుకున్నారు. జనవరి 27న ప్రారంభించిన పాదయాత్ర ఇప్పటికే నెల రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పూర్తయింది. అన్నమయ్య జిల్లాలో లోకేష్ పాదయాత్ర సాగుతోంది.
ఆయన పాదయాత్ర చేపట్టి మార్చి 5 నాటికి 35 రోజులు పూర్తయింది. 500 కిలోమీటర్లు పూర్తి చేయడానికి లోకేష్ సిద్ధంగా ఉన్నారు. తాజాగా లోకేష్ అన్నమయ్య జిల్లా పీలేరులో పర్యటించారు. ఈ సందర్భంగా పీలేరులో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు లోకేష్ కు షాక్ ఇచ్చారు. జూనియర్ ఫ్లెక్సీలు పట్టణంలో పలుచోట్ల ఏర్పాటు చేశారు.
''అన్న పెట్టిన పార్టీ అధికారంలోకి రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలి'' అంటూ ప్లెక్సీలు అభిమానులు ఈ ఫ్లెక్సీలు పెట్టారు. అయితే ఆ ఫ్లెక్సీల మీద ఎవరి పేర్లు లేవు. కేవలం పీలేరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం అని మాత్రమే ఉంది. పీలేరులో పలు ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.
అయితే మార్చి 6న లోకేష్ పీలేరులోనే పర్యటించనుండటంతో టీడీపీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాయి.
కాగా తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ హవా నడుస్తూనే ఉందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలంటూ టీడీపీలోని ఓ వర్గం నేతలతోపాటు కార్యకర్తలు, నందమూరి అభిమానుల నుంచి:గత కొంతకాలంగా డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
గతంలో ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సైతం ఎన్టీఆర్ అభిమానుల సెగ తగిలింది. చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడు సైతం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు సభల్లోనూ నినాదాలు చేశారు. సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఆయన అభిమానులు నినాదాలు చేయడం గమనార్హం. తాజాగా లోకేశ్ పాదయాత్రలోనూ ఫ్లెక్సీలు వెలియడం హాట్ టాపిక్‌గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.