Begin typing your search above and press return to search.
వైసీపీలో జూనియర్ ఫ్యాన్స్ అసోసియేషన్!
By: Tupaki Desk | 25 Feb 2023 8:29 PM GMTజూనియర్ ఎన్టీయార్ సినీ నటుడు. ఆయనకు అశేషమైన అభిమానులు ఉన్నారు. అలాగే రాజకీయ నాయకులలో కూడా ఉండడంలో తప్పు లేదు.కీలకమైన స్థానాలలో ఉన్న వారు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన వారు అగ్ర నాయకులు ఫ్యాన్స్ గా ఉంటూ హుందాగా వ్యవహరిస్తే పోయేది ఏమీ లేదు. అయితే వారు సైతం సగటు ఫ్యాన్ మాదిరిగా మాటలతో దాడి చేయడం, మా హీరోని ఏమైనా అంటే చూస్కో అన్నట్లుగా అతిగా వ్యవహరించడం పైనే ఇపుడు అంతా ఆసక్తిగా చర్చించుకోవాల్సి వస్తోంది.
ఇక ఒక పార్టీలో ఉన్న వారు అవతల పార్టీలో ఉన్న వారు కానీ వారికి కనెక్ట్ అయిన వారి విషయంలో ఆచీ తూచీ రియాక్ట్ అవుతారు. వారి మీద ప్రేమ ఉన్నా అది పూర్తిగా వ్యక్తిగతం అయినా మాటలను పొందుపుగా వాడుతూంటారు. కానీ వైసీపీలో ఇద్దరు నేతలు ఉన్నారు. వారు మాత్రం జూనియర్ మీద ఈగ వాలిస్తే తట్టుకోలేమని అంటున్నారు.
ఆ ఇద్దరే ఒకరు మాజీ మంత్రి కొడాలి నాని అయితే రెండవ వారు వల్లభనేని వంశీ. ఈ ఇద్దరూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారు. చిత్రమేంటి అంటే ఈ ఇద్దరూ టీడీపీలో ఉన్నపుడు చంద్రబాబు నుంచే బీ ఫారాలు తీసుకుని నామినేషన్లు వేసి ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే ఆ తరువాత వైసీపీలోకి కొడాలి నాని వచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే అయి మంత్రి కూడా అయ్యారు. ఇక వంశీ విషయం తీసుకుంటే కొడాలి నానికి బెస్ట్ ఫ్రెండ్. మరి 2019లోనే ఆయన వైసీపీ తరఫున పోటీ చేసి ఉండాల్సింది. కానీ ఆయనకు ఏముందో డౌట్ కానీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాక వైసీపీ వైపు వచ్చారు.
ఇక వంశీకి నానికి కూడా జూనియర్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. సినిమాలు కూడా తీశారని చెబుతారు. సరే ఆ విషయం అలా ఉంటే జూనియర్ రాజకీయాల్లో లేడు, ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నారు. ఇక ఆయన గురించి వకాల్తా పుచ్చేసుకుని నాని వంశీ ప్రతీ విషయం మీద మాట్లాడుతూ రాజకీయం చేయడమే చిత్రం. పైగా ఈ ఇద్దరు ఉన్నది వైసీపీలో. జూనియర్ ఎన్టీయార్ ఫక్తు తెలుగుదేశం.
ఆయన ఈ రోజుకు రాజకీయల్లోకి రాకపోయినా రేపో మాపో వస్తే మాత్రం తెలుగుదేశం వైపే ఉంటారు. మరి జూనియర్ ని పొగుడుతూ ఆయన తరఫున మాట్లాడుతూ టీడీపీలో చంద్రబాబుని లోకేష్ ని విమర్శించడం ద్వారా నాని, వంశీ ఏమి సాధించాలనుకుంటున్నారో కానీ తాము ఉన్న పార్టీకి మాత్రం ఇబ్బందులు తెస్తున్నారు అనే అంటున్నారు.
హలో లోకేష్ అంటూ యంగ్ స్టర్స్ పెట్టిన ఒక కార్యక్రమంలో లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయల్లోకి రావాలని కోరారు. అందులో ఎంత తప్పు ఉందో ఒప్పు ఉందో జూనియర్ ఫ్యాన్స్ చూసుకుంటారు. ఇక ఏమైనా పొరపాటు ఉంటే జూనియర్ ఎన్టీయార్ పర్సనల్ టీం కూడా రియాక్ట్ అవుతారు. కానీ మధ్యలో నాని వంశీ ఇద్దరూ మీడియా ముందుకు వచ్చి అసలు లోకేష్ ఎవరు జూనియర్ ని పార్టీలోకి ఆయన ఆహ్వానించడమేంటి అంటూ విరుచుకుపడడాన్నే అంతా చిత్రంగా చూస్తున్నారు.
జూనియర్ లోకేష్ ఇద్దరూ ఎన్టీయార్ కి మనవళ్ళే. ఒకరు కొడుకు కొడుకు అయితే మరొకరు కూతురు కొడుకు. నిజానికి వారసత్వం కొడుకు కొడుకుకే దక్కాలి. అది న్యాయం అనుకున్నా ఆ బాధ నొప్పి ఏమైనా ఉంటే అది నందమూరి వారసులకు ఉండాలి. వారు హ్యాపీగా నారా వారి నాయకత్వాన పనిచేయడానికి ఇష్టపడుతున్నపుడు మధ్యలో నాని వంశీ గీ పెట్టినా గోల పెట్టినా జరిగేది ఏముంటుంది. పోనీ దీని వల్ల జూనియర్ అర్జంటుగా రాజకీయాల్లోకి వచ్చేసి వైసీపీ తరఫున పోరాడుతారా. తన మామ చంద్రబాబు, బావ లోకేష్ కి యాంటీగా కూటమి కడతారా. అలాంటి అద్భుతాలేవీ జరగవు కదా.
అయినా సరే జూనియర్ అని పెద బాబు చినబాబుల నోటి వెంట వస్తే చాలు నాని వంశీ ఇద్దరూ కౌంటర్ కి తయారు అయిపోవడమే తమాషాగా ఉంది అంటున్నారు. ఒక విధంగా తాము ఉన్న పార్టీకి ఇది ఇబ్బందిని తెచ్చి పెట్టే వ్యవహారంగా ఉందని ఎందుకు ఆలోచించడం లేదు అన్న వారూ ఉన్నారు. జూనియర్ కి టీడీపీ పగ్గాలు ఇవ్వాలని కొడాలి నాని డిమాండ్ చేస్తున్నారు. అది పూర్తిగా టీడీపీ అంతర్గత వ్యవహారం.
ఆ పార్టీ విషయంలో వేలు కాలూ ఎలా పెడతారు అని తమ్ముళ్ళు అంటే వైసీపీ నుంచి జవాబు ఉంటుందా. ఏది ఏమైనా ఈ రకమైన రచ్చ వల్ల వైసీపీకి కొత్త తలనొప్పులు తప్ప ఒరిగేది ఏమీ లేదనే అంటున్నారు. అయినా జూనియర్ టీడీపీ ప్రెసిడెంట్ అయితే నాని వంశీలకు వచ్చే లాభమేంటి అన్నది కూడా ప్రశ్నగా ఉంది. ఒక విధంగా ఈ వైఖరి వల్లనే వారి పట్ల వైసీపీలో సందేహాలు వచ్చినా తప్పు పార్టీ పెద్దలది కాదేమో అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.