Begin typing your search above and press return to search.
ఎంపీగా జూనియర్ అయ్యన్న ...బాబు ఓకేనా...?
By: Tupaki Desk | 30 April 2023 5:00 AM GMTవిశాఖ జిల్లాలో టీడీపీ ఫైర్ బ్రాండ్ అయిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఆయన తెలుగుదేశంలో చంద్రబాబు కంటే సీనియర్. 1982లోనే ఆయన అన్న గారి సమక్షంలో పార్టీలో చేరారు. పాతికేళ్ల వయసులో ఎమ్మెల్యే అయ్యారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా ఒక సారి ఎంపీగా పనిచేశారు. ఇక పలు దఫాలుగా మంత్రిగా పనిచేసి కీలకమైన శాఖలను ఎన్నో చూశారు.
ఇక 2024 ఎన్నికల్లో అయ్యన్న మరోసారి నర్శీపట్నం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు నిజానికి అయ్యన్నకు ఈసారి పోటీ చేయడం ఇష్టం లేదు అన్న ప్రచారం ఉంది. తాను రిటైర్ అయి తన కుమారుడు చింతకాయల విజయ్ పాత్రుడిని పోటీలో దించాలని చూస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం సీనియర్లు పోటీ చేయాల్సిందే అని ఆదేశించడంతో అయ్యన్న బాబు మాట మేరకు పోటీకి సరే అంటున్నారు.
అయితే అయ్యన్న ఈ సందర్భంగా ఒక కండిషన్ పెట్టారని తెలుస్తోంది. తన కుమారుడు విజయ్ కి అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలన్నదే ఆయన డిమాండ్ అని అంటున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లోనే విజయ్ ని అనకాపల్లి నుంచి బరిలోకి దించాలని అయ్యన్న ప్రయత్నించారు. కానీ చంద్రబాబు ఒక కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే అని చెప్పడంతో అది అలా ఆగింది.
ఇక విజయ్ ఆనాడు పోటీ చేయకపోవడం కూడా మంచికే జరిగింది అని అంటున్నారు. జగన్ వేవ్ లో విజయ్ ఓడితే ఆయన రాజకీయ భవిష్యత్తు ఇబ్బందులో పడేదన్న వదన ఉంది. ఇపుడు చూస్తే ఉత్తరాంధ్రాలో టీడీపీకి ఆదరణ మళ్లీ పెరిగింది. దాంతో ఈసారి అయిదుకు అయిదు ఎంపీ సీట్లతో పాటు నూటికి తొంబై శాతం అసెంబ్లీ సీట్లను ఇక్కడ నుంచి గెలుచుకోవాలని టీడీపీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది.
దాంతో ఎంపీ సీట్లను కూడా ప్రతిష్టగా తీసుకుంటోంది. అనకాపల్లి ఎంపీ సీటుకు టీడీపీకి అభ్యర్ధులు అయితే లేరు. గత ఎన్నికల్లో ఈ సీటు నుంచి పోటీ చేసిన విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ ఇపుడు వైసీపీలో ఉన్నారు. ఆయన విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. అంగబలం, అర్ధబలం కలిగిన ఆడారి ఫ్యామిలీ వైసీపీలో ఉండడం టీడీపీకి కొంత ఇబ్బందిగా ఉంది.
దాంతో సరైన క్యాడిడేట్ కోసం సెర్చ్ చేస్తోంది. ఇక అనకాపల్లి ఎంపీ సీటులో కాపులు గవరలు నాలుగైదు దఫాలుగా ఎంపీలుగా గెలుస్తూ వచ్చారు. ఈ రెండు సామాజికవర్గాలకు ఇక్కడ బాగా బలం ఉంది. అలాగే మరో రెండు సార్లు చూస్తే వెలమలు కూడా ఈ సీటు నుంచి ఎంపీలుగా నెగ్గారు. 1998 ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు అనకాపల్లి నుంచి ఎంపీ అయ్యారు. అలాగే 2009లో మరో వేలమ నేత సబ్బం హరి కాంగ్రెస్ నుంచి ఎంపీ అయ్యారు.
ఈ విధంగా సామాజిక సమీకరణల కూర్పు తీసుకుంటే మొత్తం అనకాపల్లి పార్లమెంట్ కి సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో అనకాపల్లి, చోడవరం, పెందుర్తి ఎలమంచిలిలో కాపుల డామినేషన్ ఉంటుంది. అలాగే అనకాపల్లి, ఎలమంచిలి, పెందుర్తిలలో గవరలకు కూడా బలం ఉంది. వెలమలకు మాడుగుల, నర్శీపట్నంలలో బలం ఉంది. ఇక పాయకరావు పేటలో కూడా కాపులు ఎస్సీలు, బీసీలకు బలం ఉంది.
మొత్తానికి చూస్తే ఈ మూడు సామాజికవర్గానికి చెందిన వారే అనేకసార్లు గెలుస్తూ వచ్చారు. సిట్టింగ్ వైసీపీ ఎంపీ భీశెట్టి సత్యవతి గవర సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. ఈసారి ఆమెకు ఎంపీ టికెట్ దక్కకపోవచ్చు అని అంటున్నారు. కాపులకు ఈ సీటు ఇవ్వాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.
ఇక విజయ్ పాత్రుడు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలన్న కోరిక ఉన్నా టీడీపీ మాత్రం అన్ని రకాలుగా బలమైన వారి కోసమే చూస్తోంది అని తెలుస్తోంది. అర్ధబలం అంగబలం కూడా సమకూరాల్సి ఉంది. మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ ప్రస్తుతం రాజకీయంగా చురుకు అవుతున్నారు. మళ్లీ ఆయన రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకునేందుకు చూస్తున్నారు.
దాంతో ఆయన కనుక సరేనంటే ఎంపీ టికెట్ ఇచ్చేందుకు రెడీ అన్నది తెలుగుదేశం వర్గాల ఆలోచనగా ఉందిట. ఏది ఏమైనా జూనియర్ అయ్యన్న పార్లమెంట్ కి వెళ్లాలని ఉవ్విళ్ళూరుతున్నారు. కానీ చంద్రబాబు ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో చూస్తేనే తప్ప ఈ యువనేత రాజకీయ భవితవ్యం తేలేది ఉండదని అంటున్నారు.
నారా లోకేష్ యూత్ టీం లో కీలకంగా ఉన్న విజయ్ పాత్రుడుకి టికెట్ విషయంలో చినబబు నుంచి కూడా వత్తిడి ఉందని అంటున్నారు. అయితే ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకులకు టికెట్ ఇచ్చేందుకు బాబు సుముఖత వ్యక్తం చెస్తారా పైగా నర్శీపట్నంలో ఢీ అంటే ఢీ అన్న పరిస్థితులలో విజయ్ ని వేరే చోట ఎంపీగా పెట్టి రిస్క్ తీసుకుంటారా అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు.