Begin typing your search above and press return to search.

చంద్రబాబు అక్రమాస్తులపై తీర్పు మరోసారి వాయిదా !

By:  Tupaki Desk   |   5 Jan 2021 4:53 AM GMT
చంద్రబాబు అక్రమాస్తులపై  తీర్పు మరోసారి వాయిదా !
X
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ ఆస్తులు కూడబెట్టాడు అంటూ లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ ‌పై తీర్పు మళ్లీ వాయిదా పడింది. ఈ పిటిషన్‌ లో సోమవారం తీర్పు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ .. న్యాయమూర్తి మరోసారి వాయిదా వేశారు. చంద్రబాబు అక్రమ ఆస్తులపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలంటూ లక్ష్మీపార్వతి 2006లో ఏసీబీ ప్రత్యేక కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ ను సవాల్‌ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు. అయితే ఆరు నెలలకు మించి స్టే ఉత్తర్వులు కొనసాగడానికి వీల్లేదని సుప్రీంకోర్టు గత ఏడాది ఆదేశించిన నేపథ్యంలో ఈ ఏడాది మొదట్లో ఏసీబీ కోర్టులో ఈ కేసు విచారణ తిరిగి ప్రారంభమైంది.

చంద్రబాబు పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఈ కేసును దర్యాప్తు చేసేలా ఏసీబీని ఆదేశించాలని లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది నివేదిక అందించారు. దీంతో ఈ పిటిషన్‌ పై న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ఈ పిటిషన్‌ పై ఆదేశాలు ఇవ్వాల్సి ఉన్నా, పలుమార్లు వాయిదాపడుతూ వస్తోంది. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే అవినీతిపై దాఖలైన పిటిషన్లను రోజువారీ పద్ధతిలో విచారించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ పై వెంటనే తీర్పును వెలువరించాలని లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది పలుమార్లు ఏసీబీ ప్ర త్యేక కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే , అయితే సుప్రీం తీర్పు ఈ పిటిషన్ ‌కు వర్తించదని, కేసులు నమోదై న్యాయ స్థానాల్లో విచారణ పెండింగ్ ‌లో ఉన్న వాటికే ఆ తీర్పు వర్తిస్తుందని స్పష్టం చేసిన జడ్జ్ ఈ పిటిషన్ ‌పై తీర్పును 18కి వాయిదా వేశారు.