Begin typing your search above and press return to search.

జాద‌వ్ పూర్ యూనివ‌ర్సిటీ అమ్మాయిల‌కు సిగ్గేలేద‌ట‌

By:  Tupaki Desk   |   11 May 2016 8:12 AM GMT
జాద‌వ్ పూర్ యూనివ‌ర్సిటీ అమ్మాయిల‌కు సిగ్గేలేద‌ట‌
X
జాద‌వ్ పూర్ యూనివ‌ర్సిటీ అమ్మాయిల‌పై ఏబీవీపీ నేత‌లు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అక్క‌డి అమ్మాయిల‌ను ఎవ‌రూ వేధించ‌లేర‌ని... వారితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించార‌న్న ప్ర‌శ్నే లేద‌ని అంటూ అందుకు కార‌ణం చెప్పారు. జాద‌వ్ పూర్ యూనివ‌ర్సిటీ అమ్మాయిల‌కు అస‌లు సిగ్గే లేదు కాబ‌ట్టి వారితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించార‌న్న ప్ర‌శ్నే ఉత్ప‌న్నం కాద‌ని అంటున్నారు. అక్క‌డున్న అమ్మాయిలంతా సిగ్గూల‌జ్జా వ‌దిలేసిన‌వారేన‌ని... న‌డిరోడ్డుపై ముద్దులు పెట్టుకునే ర‌క‌మ‌ని ఆరోపించారు. వారు పూర్తిగా బ‌రితెగించిన అమ్మాయిల‌ని... అలాంట‌ప్పుడు వారిని వేధించ‌డమ‌న్న మాట‌కు అర్థ‌మే లేద‌ని అంటున్నారు.

త‌మ‌ను వేధించారంటూ జాద‌వ్ పూర్ యూనివ‌ర్సిటీ అమ్మాయిలు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌న్నీ అవాస్త‌వాల‌ని... అదంతా డ్రామా అని ఏబీవీపీ నేత సుమ‌న్ ద‌త్తా ప్రత్యారోప‌ణ‌లు చేస్తున్నారు. అక్క‌డి అమ్మాయిలు అస‌లు అమ్మాయిలే కార‌ని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. వాళ్లు ఒంటి మీద చెడ్డీలు త‌ప్ప ఇంకేమీ వేసుకోకుండా తిరుగుతూ మిగ‌తా వారినీ చెడగొట్టే ర‌కాల‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

కాగా ఇటీవ‌ల జాద‌వ్ పూర్ యూనివ‌ర్సిటీలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించిన ఏబీవీపీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సంద‌ర్భంగానూ ఏబీవీపీ నేత‌లు అక్క‌డి ప‌రిస్థితులపై మండిప‌డ్డారు. యూనివ‌ర్సిటీలో కొంద‌రు ప్రొఫెస‌ర్లు - విద్యార్థులు విద్రోహ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు.