Begin typing your search above and press return to search.
జూనియర్ విషయంలో బాబు బాలయ్య ఒక్కటేనా...?
By: Tupaki Desk | 30 April 2023 2:42 PM GMTతెలుగు తెరకు నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు. ఆయన రాజకీయ వారసత్వాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నారు. సినీ వారసత్వాన్ని బాలయ్యతో పాటు జూనియర్ ఎన్టీయార్ కొనసాగిస్తున్నారు. వర్తమానంలో చూస్తే పాన్ ఇండియా స్టార్ గా జూనియర్ ఉన్నారు. ఎన్టీయార్ మనవడిగా జూనియర్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది.
అలాంటిది జూనియర్ ని శత జయంతి వేడుకల వేళ పక్కన పెట్టడం మీద ఆయన ఫ్యాన్స్ రగిలిపోతోంది. విజయవాడలో ఈ నెల 28న జరిగిన ఈ వేడుకల సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వేదిక మీద ప్రముఖులకు కనిపించేలా జూనియర్ ఎన్టీయార్ ప్ల కార్డులతో ఆయన ఫ్యాన్స్ హల్ చల్ చేశారు. ఇది గతంలో చంద్రబాబు క్రిష్ణ జిల్లా టూర్ చేసినపుడు కనిపించిన సన్నివేశం లాంటిదే.
ఆనాడు కూడా బాబు విసిగిపోయి పోలీసులను వారి మీద పురమాయించారని వార్తలు వచ్చాయి. ఇపుడు కూడా జూనియర్ ప్ల కార్డులు సభ మొత్తం ఫ్యాన్స్ ప్రదర్శిస్తూ హడావుడి చేశారు. అయినా సరే సభలో ఎవరూ ఆయన ప్రస్థావన తీసుకురాలేదు. ఇక ముఖ్య అతిధిగా హాజరైన రజనీ కాంత్ సైతం బాలయ్యతోనే ఎన్టీయార్ నట వారసత్వం అన్నట్లుగా మాట్లాడారు.
దీని మీద క్రిష్ణా జిల్లా జూనియర్ ఎన్టీయార్ ఫ్యాన్స్ అయితే గట్టిగానే మండిపడినట్లుగా వార్తలు వచ్చాయి. అన్న గారి శత జయంతి వేడుకల వేళ సొంత మనవడిని పిలవకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నట్లుగా తెలిసింది. దాంతో ఎన్టీయార్ శతజయంతి వేడుకలను జూనియర్ ఫ్యాన్స్ ఆద్వర్యంలోనే నిర్వహిస్తామని అలా చేయాలని అసోసియేషన్ నాయకులు పిలుపు ఇచ్చినట్లుగా కూడా ప్రచారం సాగింది.
వీటిని కాస్తా పక్కన ఉంచితే వైసీపీ రజనీ కాంత్ స్పీచ్ మీద విమర్శలు ఒక వైపు చేస్తోంది. అది రాజకీయ అలజడి అనుకుంటే జూనియర్ ఫ్యాన్స్ కూడా ఈ పరిణామలా పట్ల అసంతృప్తిగా ఉన్నారన్నది మాత్రం ఆలోచించాల్సిందే. కొందరు జూనియర్ ఫ్యాన్స్ అయితే తెలుగుదేశానికి యాంటీగా జూనియర్ కొత్త పార్టీ పెడితే అపుడు టీడీపీ సంగతి ఏంటి అన్న ప్రశ్న కూడా వేస్తున్నట్లుగా చెబుతున్నారు.
బాలయ్య రాజకీయం చూస్తే ఆయన నటుడిగా నాలుగు దశాబ్దాల కాలంగా ఉన్నారు. ఇపుడు యంగర్ జనరేషన్ లో జూనియర్ ఉన్నారు. రేపటి రోజున అన్న గారి వారసత్వాన్ని కొనసాగించేది కూడా జూనియర్ అని అంటున్నారు. అలాటప్పుడు ఆయన్ని దగ్గర చేసుకోకుండా ఇలా చేయడం వల్ల లాభం కంటే నష్టమే అంటున్నారు. అదే విధంగా చంద్రబాబు సైతం తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆగారో లేక బాలయ్యకు ఇష్టం లేదని తానూ జూనియర్ ని దూరం పెడుతున్నారో తెలియదు కనీ జూనియర్ ని సరిగ్గా టీడీపీ వాడుకోకపోవడం మాత్రం జనాలకు వేరేగా సంకేతాలు పంపిస్తుంది అని అంటున్నారు.
రజనీని రప్పించి టీడీపీకి కొత్తగా తెచ్చుకునే మైలేజ్ ఏమీ లేదని, అదే సమయంలో జూనియర్ ని దూరం పెట్టి మాత్రం టీడీపీ చాలానే నష్టపోతుందని అంటున్నారు. కానీ జూనియర్ విషయంలో బాలయ్య బాబు ఒక్కలాగానే ఆలోచిస్తూండడం వల్లనే టీడీపీకి అది మేలు కలగచేస్తుందా లేక మైనస్ అవుతుందా అన్నది ఫ్యూచర్ చెబుతుంది అని అంటున్నారు.