Begin typing your search above and press return to search.

జాన్సన్ - జాన్సన్ 9 బిలియన్ల పరిహారం

By:  Tupaki Desk   |   5 April 2023 9:02 PM GMT
జాన్సన్ - జాన్సన్ 9 బిలియన్ల పరిహారం
X
అది చిన్నపిల్లలు వాడే ప్రోడక్ట్.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో నమ్మారు. పిల్లలకు వాడారు. కానీ ఆ కంపెనీ మోసం చేసింది. తమ కంపెనీ టాల్కం పౌడర్ లలో క్యాన్సర్ వ్యాపింపచేసే ‘అస్ బెస్టాస్’ను కలిపింది. అప్పుడే పుట్టిన పిల్లల ప్రాణాలతో చెలగాటమాడింది. ఆ కంపెనీ మరెంటో కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయిన ‘జాన్సన్ అండ్ జాన్సన్’. చిన్న పిల్లల బేబీ పౌడర్ ‘జాన్సన్ అండ్ జాన్సన్’ తోపాటు ఆ కంపెనీ అన్ని ఉత్పత్తులతో క్యాన్సర్ వస్తుందని తేలింది. విష పదార్థాలతో ఉత్పత్తులు తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంది. అందుకే అమెరికా సహా సుమారు ప్రపంచవ్యాప్తంగా కంపెనీపై వేల కేసులు నమోదయ్యాయి. ఒక్క అమెరికాలోనే 40 వేల కేసులు దాఖలయ్యాయి. దీంతో 2020 నుంచి జాన్సన్ కంపెనీ తమ పౌడర్ అమ్మకాలను నిలిపివేసింది.

ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీపై దాఖలైన కేసులకు పరిహారంగా జాన్సన్ & జాన్సన్ కంపెనీ దాదాపు 9 బిలియన్ల డాలర్లతో సెటిల్ మెంట్ కు ముందుకొచ్చింది. బేబీ పౌడర్ క్యాన్సర్‌కు కారణమైందనే ఆరోపణలను కవర్ చేయడానికి కేటాయించింది. కంపెనీ గతంలో కేటాయించిన మొత్తం కంటే నాలుగు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

తమ కంపెనీపై వేసిన కేసులను విలువైనవిగా గుర్తిస్తున్నట్టు జాన్సన్ కంపెనీ తెలిపింది. న్యాయపోరాటం చేస్తున్న వారికి సెటిల్ మెంట్ ను పెంచినట్టు అంగీకరించింది.

గతంలో రెండు బిలియన్ డాలర్లు మాత్రమే ఇస్తానని చెప్పిన ఆ కంపెనీ ఇప్పుడు తన సెటిల్ మెంట్ ను 9 బిలియన్ డాలర్లకు పెంచడం గమనార్హం. జాన్సన్ కంపెనీపై కేసు వేసిన 40వేల మంది ఆ కంపెనీ ఉత్పత్తుల్లో క్యాన్సర్ కు కారణమైన అస్ బెస్టాస్ ఉన్నట్లు ఆరోపించారు.

అమెరికాలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన టాల్కమ్ పౌడర్ అమ్మకాలను 2020 నుంచే ఆపేశారు. ఇక గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తుల అమ్మకాన్ని ఆ కంపెనీ నిలిపివేసింది. దాదాపు 130 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ తన ఉత్పత్తుల్ని అముతోంది. కానీ ఇప్పుడు అవమానకరంగా క్యాన్సర్ కారకాలను పౌండర్ లో కలిపిందన్న విమర్శలతో మూసుకోవాల్సి వచ్చింది. అందుకు భారీ పరిహారాన్ని ఇచ్చేందుకు ముందుకు రావడం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.