Begin typing your search above and press return to search.
ఇదేదో తేడాగా ఉందో.. బైడెన్ భార్యతో.. కమలా హ్యారిస్ భర్త..!
By: Tupaki Desk | 8 Feb 2023 6:00 PM GMTవచ్చే ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా ఏడాది సమయం ఉండగానే అమెరికా రాజకీయాలు హీటెక్కాయి. ఇటీవల అమెరికా జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అధికారంలో ఉన్న డెమొక్రాట్లు తక్కువ స్థానాలకే పరిమితమైతే ప్రతిపక్ష రిపబ్లికన్లు మాత్రం మెజారిటీ స్థానాలు కైవసం చేసుకొని ప్రెసిడెంట్ బైడెన్ కు షాకిచ్చారు.
అంతేకాకుండా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాదిరిగానే ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ సైతం అమెరికా సంబంధించిన రహస్య పత్రాలను దాచిన కేసులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎఫ్బీఐ ఈ మేరకు వైట్ హౌస్ కు చెందిన రహస్య ప్రతాలను స్వాధీనం చేసుకొని ఈ ఘటనపై విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే అమెరికా రాజకీయాల్లో ఒక వీడియో మాత్రం వైరల్ మారుతూ కొత్త చర్చకు తెరలేపింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య.. ప్రథమ పౌరురాలైన జిల్ బైడెన్ ను అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ భర్త డౌ ఎమ్హోఫ్ అందరూ చూస్తుండగానే ముద్దు పెట్టాడు.ఇదేదో మాములు ముద్దు అయితే ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు గానీ.. లిప్ లాక్ చుంబనం కావడంతో ఈ వ్యవహారం ట్రోలింగ్ కు దారితీసింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మంగళవారం కాపిటోల్ హిల్ లో అధ్యక్షుడు జో బైడెన్ స్టేట్ ఆఫ్ ది యూనియర్ ను పురస్కరించుకొని ప్రసంగిస్తున్న సందర్భంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.చట్ట సభలోనే అమెరికా ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్.. కమలా హ్యారీస్ భర్త ఎమ్హోఫ్ లు పెదాలపై చుంబించుకోవడం కన్పించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దీనిపై ఎవరూ వారు ఇదోదే తేడా ఉందే అంటూ ఊహాగానాలకు తెరలేపుతున్నారు
ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం మరోసారి ఉపాధ్యక్ష రేసులో కమలా హ్యారీస్ ను నిలుపకూడదని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు వైట్ హౌస్ వర్గాలకు బైడెన్ అంతరంగికుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నారని లాస్ ఏంజెల్స్ టైమ్స్ తాజా ఓ కథనం ప్రచురించింది. త్వరలో అధ్యక్ష ఎన్నికల సమీపిస్తున్న వేళ ఇప్పటికే బైడెన్ అనేక చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు.
దీనికి తోడు ఆయన భార్య జిల్ బైడెన్.. డౌ ఎమ్హోఫ్ ల యవ్వారం ఆయనకు కొత్త సమస్యలు తీసుకొచ్చేలా కన్పిస్తోంది.అయితే అమెరికా కల్చర్ లో ఇదంతా కామనే కావడంతో ఈ వ్యవహారాన్ని కొందరు లైట్ తీసుకుంటున్నారు. మరికొందరు మాత్రం మున్ముందు ఈ యవ్వారం ఎలాంటి మలుపు తిరుగుతుందోననే ఆసక్తిని కనబరుస్తుండటం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.