Begin typing your search above and press return to search.
బైడెన్ కు వైట్ హౌస్ అస్సలు నచ్చటం లేదా?
By: Tupaki Desk | 18 Feb 2021 10:30 AM GMTప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాలో.. అందునా సకల రాజభోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వైట్ హౌస్ లో ఇబ్బందులా? అక్కడి సిబ్బందితో చిక్కులా? అది కూడా దేశాధ్యక్షుల వారికా? అంటే షాక్ తినాల్సిందే. కాకుంటే.. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ యాంగిల్లో చూస్తే.. నిజంగానే ఇబ్బందులని చెప్పాలి. ట్రంప్ లాంటి అధినేతకు.. పవర్ ను ఎంతలా ఎంజాయ్ చేయాలో తెలుసు. వాటి వల్ల వచ్చే దర్పానికి నిలువెత్తు రూపంగా ఉంటూ.. మరింత రాజభోగాలకు సదా సిద్ధంగా ఉన్నట్లు ఆయన వ్యవహారశైలి ఉంటుంది.
కానీ.. బైడెన్ మాత్రం అందుకు భిన్నంగా రియాక్టు అవుతున్నారు. వైట్ హౌస్ లో నాలుగు వారాలు గడిపిన అనంతరం.. శ్వేతసౌధంలో తన లైప్ గురించి తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైట్ హౌస్ లో తన జీవితాన్ని బంగారు పంజరంతో పోల్చటం విశేషం. గతంలో అధ్యక్షులుగా ఉన్న వారంతా శ్వేతసౌధంలో ఉండటం అంటే.. పూతపూసిన బంగారం లాంటి పంజరంలో ఉన్నట్లు ఉంటుందని చెప్పేవారని.. అందులో వాస్తవం ఉందన్నారు.
ప్రతిరోజు పొద్దున్నే లేవగానే.. తాను ఎక్కడ ఉన్నది ఒక్క క్షణం అర్థం కాదని.. తన భార్యతో మనం ఎక్కడ ఉన్నామని జోక్ చేస్తానని చెప్పారు. టౌన్ హాల్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. తనతాజా జీవితం మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన బైడెన్ కు శ్వేతసౌధం కొత్తది కాదు. కాకుంటే.. ఆయన ఎప్పుడూ అందులో ఉండలేదు. అక్కడి వ్యక్తిగత వసతుల్ని పొందలేదు.
వైట్ హౌస్ సిబ్బంది అనుక్షణం తన వెంటే ఉంటూ.. ప్రతిది అందిస్తుంటే తనకు అస్సలు నచ్చటంలేదన్నారు. తన కోసం వారంతా వెయిట్ చేయటం తనకు ఇబ్బందిగా ఉందన్నారు. తాను అన్ని విషయాల్లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటానని.. కానీ ఇంకెవరో వచ్చి తాను ధరించాల్సిన సూటు కూడా తీసి ఇవ్వటాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. వైట్ హౌస్ సిబ్బంది తన వ్యక్తిగత పనులు చేయటం వల్ల తనకు ఊపిరి ఆడటం లేదని.. బంగారు పంజరంలో ఉన్నట్లుగా అనిపిస్తోందన్నారు. గడిచిన నాలుగు వారాలు..తనకు నాలుగు సంవత్సరాలుగా ఉన్నట్లు ఉందన్నారు. బైడెన్ తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారటమే కాదు.. ఆయన సింప్లిసిటీని చెప్పేస్తున్నాయని చెబుతున్నారు.