Begin typing your search above and press return to search.

హర్యానా సీఎంగా ఖట్టర్..డిప్యూటీ సీఎంగా దుష్యంత్

By:  Tupaki Desk   |   26 Oct 2019 12:00 PM GMT
హర్యానా సీఎంగా ఖట్టర్..డిప్యూటీ సీఎంగా దుష్యంత్
X
హర్యానాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకి మార్గం సుగమం అయ్యింది. బీజేపీకి జేజేపీ పార్టీ మద్దతు ప్రకటించడంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కి రంగం సిద్ధం చేసింది. హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్‌లాల్ ఖట్టర్ వరుసగా రెండో సారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం సీఎంగా మనోహర్‌ లాల్ ఖట్టర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.బీజేపీఎల్పీ నేతగా ఖట్టర్ ని ఎన్నుకోవడం ... ప్రభుత్వ ఏర్పాటుకి తాము సిద్ధంగా ఉన్నట్లు గవర్నర్‌ను కలిసి తెలియజేసారు.

ఖట్టర్ రాజ్ భవన్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 2:15 గంటలకు సీఎం గా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అలాగే సీఎం తో పాటుగా జేజేపీ అధినేత దుశ్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజాగా హర్యానా లో జరిగిన ఎన్నికలలో హౌంగ్ ప్రభుత్వం వచ్చిన విషయం తెలిసిందే. హర్యానాలో బీజేపీ 40 స్థానాలు మాత్రమే గెలిచి మ్యాజిక్ ఫిగర్‌కు ఆరు సీట్ల దూరంలో నిలించింది.దీనితో 10 సీట్లు గెలిచిన జేజేపీ బీజేపీకి మద్దతు ఇస్తామని ప్రకటిచింది.

హర్యానాలో స్థిరమైన ప్రభుత్వం ఉండాలంటే బీజేపీకి మద్దతు ఇవ్వాలని తాము భావించినట్లు దుశ్యంత్ చౌతాలా చెప్పారు. ఇకపోతే ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రిగా దుష్యంత్‌ తల్లి నైనా చౌతాలా పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. నైనా బాంద్రా నియోజకవర్గం నుంచి పోటీ చేసి 13వేల పైచిలుకు ఓట్లతో కాంగ్రెస్‌ నేత రణ్‌ బీర్‌ సింగ్‌ మహేంద్రను ఓడించారు. టీచర్ల భర్తీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న అజయ్‌ చౌతాలాకు భార్య నైనా చౌతాలా. కానీ చివరికి దుశ్యంత్ పేరునే ఉప ముఖ్యమంత్రిగా ఫిక్స్ చేసారు.