Begin typing your search above and press return to search.
జియో ఫ్రీ ఫోన్...దిమ్మతిరిగే నిజాలు!
By: Tupaki Desk | 27 Sep 2017 1:30 PM GMTకొద్ది రోజుల క్రితం జియో ఫోన్లను ఫ్రీగా అందించనున్నామని ముకేష్ అంబానీ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనతో భారత టెలికం రంగంలో కలకలం రేగింది. రూ. 1500 డిపాజిట్ చేసి - రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ సొంతం చేసుకుంటే - మూడేళ్ల తరువాత ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ప్రకటించారు. దీంతో, అందరూ జియో ఫోన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు రిలయన్స్ దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. జియో 4 జీ ఫోన్ కు సంబంధించిన నియమనిబంధనలు - షరతులను ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేసింది. ఉచిత ఫోన్లపై కోటిఆశలు పెట్టుకున్న కస్టమర్లకు నిరాశ మిగిల్చింది. ఆ షాకింగ్ నిబంధనలు - మాండేటరీ రీచార్జ్ ల బాదుడు - కనీస రీఛార్జిలు - ఫోన్ రిటర్న్ విధానాలు వంటి 8 అంశాలను తన వెబ్ సైట్ లో పొందుపరిచింది.
కేవలం 1500 రూపాయలు డిపాజిట్ చేస్తే జియో 4 జీ ఫీచర్ ఫోన్ మీ సొంతమంటూ రిలయన్స్ ప్రకటనలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఫ్రీ ప్రకటన వెనుక ఉన్న మతలబేమిటో ఎట్టకేలకు రిలయన్స్ చెప్పేసింది. జియో ఫోన్ కోసం డిపాజిట్ చేసిన రూ.1500 సొమ్ము తిరిగి పొందవచ్చని రిలయన్స్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఆ డిపాజిట్ పొందాలంటే ఓ షరతును విధించింది. మూడు సంవత్సరాల్లో కనీసం రూ.4500 విలువైన రీచార్జ్ తప్పనిసరిగా చేసుకోవాలి. మూడు నెలల పాటు ఎలాంటి రీచార్జ్ లు చేసుకోకుంటే ఆ 1500 రూపాయలు రిఫండ్ రావు. అదేవిధంగా, మూడేళ్ల పాటు ప్రతి సంవత్సరం కచ్చితంగా రూ.1500 (మొత్తం రూ.4500) విలువైన రీచార్జ్ చేసుకోవాలి.
ఈ గోలంతా మనకెందుకులే, జియో ఫోన్ వెనక్కి ఇచ్చేద్దామనుకుంటే కుదరదు. ఒక వేళ మధ్యలోనే ఫోన్ వెనక్కు ఇచ్చేయాలని చూస్తే అదనంగా పెనాల్టీని చెల్లించాల్సిందే. ఫోన్ కొన్న ఏడాదిలోపు రిటర్న్ చేస్తే రూ.1500 - ప్లస్ జీఎస్ టీని పెనాల్టీగా చెల్లించాలి. ఒకవేళ మొదటి సంవత్సరం వాడుకుని రెండో సంవత్సరం దాన్ని రిటర్న్ చెయ్యాలనుకుంటే రూ.1000 రూపాయలు - ప్లస్ జీఎస్టీ పెనాల్టీ కట్టాలి. మూడో సంవత్సరం 36 నెలలు పూర్తయ్యే లోపు రిటర్న్ చెయ్యాలంటే రూ. 500 ఫైన్ - ప్లస్ జీఎస్టీ కట్టాలి. రిలయన్స్ విధించిన ఈ నిబంధనలు - షరతులకు లోబడి వినియోగదారుడు చెల్లించిన రూ.1500 తిరిగి వస్తాయి. కాగా, జియో తాజా నిబంధనలపై వినియోగదారులు మండిపడుతున్నారు. అంతా ఉచితం అంటూ.....ప్రకటించిన రిలయన్స్ గుట్టురట్టయిందని అభిప్రాయపడుతున్నారు. చదువురాని వారు జియో ఉచిత ఫోన్ తీసుకొని ఇబ్బందులు పడతారని భావిస్తున్నారు. ఒకవేళ జియో ఫోన్ తీసుకోవాలనుకుంటే ఆ షరతులు - నిబంధనల గురించి పూర్తిగా తెలుసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.