Begin typing your search above and press return to search.

ప్రేయసిని పెళ్లాడిన మరో మహిళా క్రికెటర్.. ఈసారి ఎవరంటే?

By:  Tupaki Desk   |   15 April 2023 9:32 AM GMT
ప్రేయసిని పెళ్లాడిన మరో మహిళా క్రికెటర్.. ఈసారి ఎవరంటే?
X
మగాళ్లు ఆడాళ్లను పెళ్లి చేసుకోవటం పాత ముచ్చట. చాలా అరుదుగా కనిపించే స్వలింగ పెళ్లిళ్లు.. ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. సెలబ్రిటీలు.. ప్రముఖులు సైతం ఈ తరహా పెళ్లిళ్ల బాట పట్టటం తెలిసిందే.తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ జెస్ జొనాసెన్ తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్న వైనం తాజాగా వెల్లడైంది.

ఇక్కడో విషయాన్ని చెప్పాలి. మరే క్రీడలో లేనట్లుగా మహిళా క్రికెటర్లు పలువురు తమ జీవిత భాగస్వాములుగా మహిళల్నే ఎంచుకోవటం కనిపిస్తుంది. ఇందుకు నిదర్శనంగా స్టార్ ప్లేయర్లుగా పేరున్న మెగాన్ షట్.. మరిజానెకాప్.. అమీ సాటర్త్ వైట్ లాంటి మహిళా క్రికెటర్ లు తమ పెళ్లిళ్లను మహిళలతోనే చేసుకోవటం కనిపిస్తుంది.తాజాగా ఆ జాబితాలోకి చేరారు ఆసీస్ క్రికెటర్ జెస్ జొనాసెన్.

తాజాగా తన పెళ్లికి సంబంధించిన కీలక అప్డేట్ ను ఆమె వెల్లడించారు. పదేళ్లుగా పీకల్లోతు ప్రేమలో ఉన్న తన ప్రియురాలు సారా వెర్న్ ను తాను పెళ్లి చేసుకున్న విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోల్ని ఆమె షేర్ చేశారు. హవాయి ద్వీపంలో చాలా కొద్దిమంది సన్నిహితుల మధ్య తమ పెళ్లి జరిగిన విషయాన్ని ఆమె వెల్లడించారు.

ఇక.. జెస్ జొనాసెన్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలు. అల్ రౌండర్ అయిన ఈ 30 ఏళ్ల మహిళా క్రికెటర్.. ఐదుసార్లు టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీంలో సభ్యురాలు కావటం గమనార్హం. గత ఏడాది జరిగిన మహిళా వన్డే ప్రపంచ కప్ ను సొంతం చేసుకున్న జట్టులోనూ ఆమె సభ్యురాలు. భారత్ లో జరిగిన మహిళా ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఆమె సభ్యురాలు. ఇలా భారత్ లోని క్రికెట్ అభిమానులకు సైతం ఆమె సుపరిచితురాలు.