Begin typing your search above and press return to search.
కింగ్ మేకరూ కాలేదు...కొడుకూ ఓడిపోయాడు
By: Tupaki Desk | 13 May 2023 8:00 PM GMTకర్నాటక ఎన్నికల్లో ప్రజలు ఒక విస్పష్టమైన తీర్పునే ఇచ్చారు అనుకోవాలి. ట్రయాంగిల్ ఫైట్ కదా మూడు పార్టీల మధ్య సీట్లు చీలి హంగ్ అసెంబ్లీ వస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ ప్రజలు ఏకపక్షంగా కాంగ్రెస్ కి జై కొట్టారు. అది ఎంతలా అంటే జేడీఎస్ కి పట్టున్న ప్రాంతాలలో సైతం కాంగ్రెస్ పాగా వేసింది.
ఫలితంగా కింగ్ మేకర్ అవుదామనుకున్న జేడీఎస్ నేత కుమార స్వామి ఆశలు ఫలించలేదు. అంతే కాదు ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామిని రామనగర నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. తన రాజకీయ వారసుడిగా ఉంటారనుకున్నారు. తాను కింగ్ అయితే అందులో కొడుకుకి మంత్రి పదవి ఇచ్చి రాజకీయ రాచబాట కల్పించాలనుకున్నారు.
కానీ కాంగ్రెస్ అభ్యర్ధి ఇక్బాల్ హుస్సేన్ చేతిలో నిఖిల్ దారుణంగా ఓటమి పాలు అయ్యారు. నిజానికి రామనగర సీటులో 2018లో కుమారస్వామి గెలిచారు. ఆయన రెండవ సీటు అయిన చన్నపట్నలో కూడా గెలవడంతో దాన్ని ఉంచుకుని రామనగరకు రాజీనామా చేశారు.
అలా ఆ సీటులో తన భార్య అనితా కుమారస్వామిని ఉప ఎన్నికల్లో పోటీకి పెట్టి గెలిపించారు. ఇపుడు నిఖిల్ కోసం తల్లి అనిత ఆ సీటు త్యాగం చేసింది. అయినా కూడా ఆయన ఓడారు. అంటే తల్లీ తండ్రీ గెలిచిన సీట్లలో నిఖిల్ ఓడి వారికి గట్టి షాక్ ఇచ్చాడన్న మాట.
అయితే నిఖిల్ కి ఈ ఓటమి కొత్త కాదు, మొదటిది కాదు, 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాండ్యా ఎంపీ సీటుకు జేడీఎస్ తరఫున పోటీ పడి ఇండిపెండెంట్ గా బరిలో ఉన్న సినీ నటి సుమలత చేతిలో ఓడిపోయాడు. మొత్తం మీద చూసుకుంటే నిఖిల్ రాజకీయ వారసుడు అవుతాడు అని కుమారస్వమి కంటున్న కలలు ఈ ఫలితాలలో కల్లౌగా మారాయని అంటున్నారు. మొదట సినీ హీరోగా ఆయన్ని పరిచయం చేశాడు కుమ్మారస్వామి. అక్కడ కెరీర్ సాఫీగా సాగలేదు. దాంతో రాజకీయాలోకి తెచ్చారు. కానీ కుమారస్వామి అయినా అనేక సార్లు గెలుస్తున్నాడు కానీ నిఖిల్ వరసగా ఓడిపోతున్నాడు.
మరి మార్చి పోతే సెప్టెంబర్ ఉంది అన్నట్లుగా అసెంబ్లీ ఎన్నికలలో ఓడితే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి అక్కడ మరోసారి ఎంపీగా పోటీ చేస్తాడేమో చూడాలని అంటున్నారు. ఇక జేడీఎస్ కి ఈ ఫలితాలు ఎంతలా షాక్ ఇచ్చాయంటే గత ఎన్నికల్లఒ 37 సీట్లను గెలుచుకున్న ఆ పార్టీ బలం సగానికి సగం పడిపోయింది.
జేడీఎస్ ఒకే ఒక్కసారి 50 సీట్ల మార్క్ ని దాటింది. కానీ తన రాజకీయ ప్రస్థానంలో ఎపుడూ 40 మార్క్ ని దాటలేకపోతోంది. ఇపుడు అ నంబర్ కాస్తా ఇరవైకి వచ్చేసింది. దేవేగౌడకు ఉన్న పట్టు ఎత్తులు జిత్తులు వ్యూహాలు కుమార స్వామిలో లేవు. ఆయన వెనక డైరెక్షన్ అంతా దేవెగౌడాదే. పైగా జేడీఎస్ లో రాజకీయ వారసత్వం కోసం పోరు ఒక వైపు సాగుతోంది. మరో వైపు చూస్తే కుమారస్వామి సోదరుడు రేవణ్ణ కూడా పార్టీ మీద ఆధిపత్యం కోసం చూస్తున్నారు.
సామాజికవర్గ పరంగా చూస్తే వక్కలిగ కులస్తులు జేడీఎస్ ని అట్టిపెట్టుకుని గత ఎన్నికల దాకా ఉండేవారు. ఇపుడు కాంగ్రెస్ నుంచి డీకే శివకుమార్ అదే కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ వైపు వారు టర్న్ అవుతున్నారని అంటున్నారు. ఇలా చూసుకుంటే రాను రానూ జేడీఎస్ బలం పడిపోతోంది. 2024లో ఎంపీ ఎన్నికల నాటికి ఉనికి చాటుకోకపోతే జేడీఎస్ కి బిగ్ ట్రబుల్స్ స్టార్ట్ అయినట్లే అంటున్నారు.