Begin typing your search above and press return to search.
మళ్లీ భగ్గుమన్న తాడిపత్రి!
By: Tupaki Desk | 7 July 2023 4:36 PM GMTఅనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి రైతులకు రావాల్సిన పరిహారాన్ని స్వాహా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బత్తాయి మొక్కలు నాటిన ఏడాదికే పంట నష్టం పరిహారం కింద రూ.13.89 లక్షలు పెద్దారెడ్డి రాయించుకున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాకు ఆధారాలు విడుదల చేశారు. పరిహారం పొందినవారి జాబితాలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేరుందని మీడియాకు చూపించారు.
ఎమ్మెల్యేకు భయపడి అధికారులు పరిహారం ఇస్తున్నారన్నారని జేసీ ప్రభాకరరెడ్డి మండిపడ్డారు. పరిహారం నిధులను ఖాతాలో జమ చేసే లోగా ఈ అవినీతిని అడ్డుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.
మరోవైపు పెద్దారెడ్డి అన్న కుమారుడు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి 'గుడ్‌మార్నింగ్ ధర్మవరం' పేరుతో దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఆయన తిండి నుంచి దుస్తుల వరకు అన్నీ నేతన్నల నుంచి దోపిడీ చేసినవేనని ఆరోపించారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వల్ల ధర్మవరంలో నేత నేసేవాళ్లు ఎంత బాధపడుతున్నారో ఎవర్ని అడిగినా తెలుస్తుందని జేసీ ఆరోపించారు.
తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఏడాదిన్నర చీనా తోటకు పంట బీమా డబ్బులు కొట్టేశారని ఆరోపిస్తూ జేసీ ప్రభాకరరెడ్డి ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. పంటల భీమాలో రైతులకు న్యాయం జరగలేదని.. వైసీపీ నాయకులకే న్యాయం జరిగిందని జేసీ ఆరోపించారు. క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో రూ.13.89 లక్షలు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కొట్టేశారని ఆరోపించారు.
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక్రట్రామిరెడ్డి తాడిపత్రికి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని.. కారుకూతలు కూస్తున్నారని జేసీ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''నీ ధర్మవరం వస్తా... నీ ఇంటి దగ్గరకు వస్తా.... ఏం చేస్తావ్'' అంటూ సవాల్ విసిరారు. ధర్మవరం ఎమ్మెల్యే వెంక్రట్రామిరెడ్డి లండన్ లో క్లబ్బుల్లో గ్లాసులు కడిగేవారని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చీనా తోటకు వస్తున్నా.... దమ్ముంటే తనను ఆపాలని సవాల్ విసిరారు. చీనా తోటలో పంట లేకుండానే... ఎమ్మెల్యే పెద్దారెడ్డి పంట బీమా సొమ్ము కొట్టేశారని ఆరోపించారు. ఏడాది వయస్సున్న చీనా చెట్లకు పంట నష్టం బీమా ఎలా వచ్చిందో అధికారులు చెప్పాలని నిలదీశారు.
ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఇన్సూరెన్స్ డబ్బులు ఎలా వచ్చాయో చెప్పాలని వచ్చే సోమవారం స్పందనలో ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ''నేను పోవటం కాదురా.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాడె ఎత్తేందుకు నేను పోతా'' అని హాట్ కామెంట్స్ చేశారు.