Begin typing your search above and press return to search.

`అమ్మ‌` మిస్ట‌రీపై కారు డ్రైవ‌ర్ అయ్య‌ప్ప‌న్ క్లారిటీ!

By:  Tupaki Desk   |   9 March 2018 10:39 AM GMT
`అమ్మ‌` మిస్ట‌రీపై కారు డ్రైవ‌ర్ అయ్య‌ప్ప‌న్ క్లారిటీ!
X
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మ‌ర‌ణం ఓ మిస్ట‌రీ అని, ఆమె మ‌ర‌ణం వెనుక అనేక అనుమాలున్నాయ‌ని త‌మిళ‌నాడులో ర‌క‌ర‌కాల పుకార్లు షికార్లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అమ్మ‌ను ఆసుప‌త్రిలో చేర్పించే స‌మ‌యానికే ఆమె కోమాలో ఉందని, 2016 డిసెంబ‌రు 5 కు కొద్దిరోజుల ముందే ఆమె మ‌ర‌ణించింద‌ని పుకార్లు వచ్చాయి. ఆమె ఇంట్లో మెట్ల‌పై నుంచి కింద‌ప‌డి గాయ‌మైంద‌ని...ఆ త‌ర్వాత అపోలో వైద్యులు ఆమె కాళ్లను తొలగించారని మ‌రి కొంత‌మంది అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఈ ఆరోపణలు - పుకార్ల‌కు తెర‌దించుతూ జ‌య‌ల‌లిత కారు డ్రైవరు అయ్యప్పన్ క్లారిటీ ఇచ్చారు. ఆసుప‌త్రిలో జ‌య‌ల‌లిత‌ను తాను చూశాన‌ని, ఆమె కాళ్లు తొల‌గించలేద‌ని చెప్పారు. అమ్మ‌ చికిత్స పొందుతున్న సమయంలో తాను 3సార్లు చూశానని అన్నారు. జయలలిత మరణించిన తరువాత ఆమె కాళ్లకు తానే తాడు కట్టానని, ఆ సమయంలో డీఎస్పీ కరుప్పస్వామి కూడా అక్కడే ఉన్నారని అయ్యప్పన్ చెప్పారు. మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ కమీషన్ ముందు హాజరైన అయ్య‌ప్ప‌న్ మ‌రిన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు.

జయలలిత కాళ్లను తొలగించినట్టు వ‌చ్చిన పుకార్ల‌ను అపోలో యాజమాన్యం గ‌తంలోనే ఖండించింది. తాజాగా, అయ్య‌ప్ప‌న్ వ్యాఖ్య‌లను బ‌ట్టి జ‌య‌ల‌లిత కాళ్ల‌ను తొల‌గించ‌లేద‌ని స్ప‌ష్ట‌మైంది. 2016 సెప్టెంబర్ 21న‌ జయలలిత అనేక కార్యక్రమాల్లో పాల్గొని మానసికంగా చాలా ఇబ్బందిపడ్డారని, ఆసుపత్రిలో చేరాలని డాక్టర్ శివకుమార్ సూచించినా జయలలిత విన‌లేద‌ని చెప్పారు. చివ‌ర‌కు 2016 సెప్టెంబర్ 22వ తేదీ అర్ధ‌రాత్రి జయలలితను అపోలో ఆసుపత్రిలో చేర్చామని త‌న‌కు చెప్పార‌ని, తాను అపోలో ఆసుపత్రికి వెళ్లి అమ్మను చూశానని అయ్యప్పన్ అన్నారు. అపస్మారకస్థితిలోనే అమ్మ అపోలో ఆసుపత్రిలో చేరారని అయ్యప్పన్ స్పష్టం చేశారు. ఆ రోజు ఆసుప‌త్రిలో శశికళతో పాటు అప్పటి తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావ్ - జయలలిత సెక్యూరిటీ అధికారి వీరపెరుమాల్ - డీజీపీ రాజేంద్రన్ - అమ్మ వ్యక్తిగత కార్యదర్శి పెనగుండ్రన్ అక్కడే ఉన్నారని తెలిపారు. అమ్మ‌ను చిన్నమ్మ శశికళ క‌డ‌వ‌ర‌కూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారని తెలిపారు. ఏ రోజూ నిర్లక్షం చేసినట్లు తాను చూడలేదని, శ‌శిక‌ళ మీద తనకు ఎలాంటి అనుమానం లేదన్నారు. అమ్మ ఆసుప‌త్రిలో ఉన్న‌పుడు పన్నీర్ సెల్వం - మంత్రులు ప్రతి రోజు ఉదయం 9.30 గంటలకు వ‌చ్చేవార‌ని - అమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకునేవార‌ని చెప్పారు. అయ్య‌ప్ప‌న్ చెప్పిన విష‌యాల‌ను విచారణ కమీషన్ రికార్డు చేసుకుంది.