Begin typing your search above and press return to search.

‘అమ్మ’ ఆఖరి సీన్లో కనిపించిన బొద్దు కుర్రాడెవరు?

By:  Tupaki Desk   |   8 Dec 2016 6:05 AM GMT
‘అమ్మ’ ఆఖరి సీన్లో కనిపించిన బొద్దు కుర్రాడెవరు?
X
అమ్మకు సంబంధించిన ప్రతి విషయం ఆసక్తికరమే. ఎందుకంటే.. ఆమెకు సంబంధించిన చాలా అంశాలు సాధారణంగా ఉండవు. అసాధారణంగా ఉంటాయి మరి. ప్రాణ స్నేహితురాలు.. నిత్యం తన పక్కన ఉంచుకునే శశికళ ముచ్చటే చూద్దాం. అమ్మ ఆమెకు ఎంత ప్రయారిటీ ఇస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి.. అలాంటి నెచ్చెలి భర్తను అమ్మ తన నివాసానికి కూడా రానివ్వకపోవటం చూస్తే.. అమ్మ తీరు ఎంత విలక్షణంగా ఉంటుందో అర్థమవుతుంది.

అస్వస్థతతో చెన్నై అపోలో చేరిన అమ్మ.. 74 రోజుల పాటు పోరాడి ఓడిన ఆమె.. సోమవారం రాత్రి శాశ్విత నిద్రలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. వైష్ణవ సంప్రదాయాన్ని పాటించే బ్రాహ్మణ వర్గానికి జయలలిత ప్రతినిధి. మరి.. ఆమె అంతిమ సంస్కారాలు ఎవరు చేస్తారు? అన్న విషయంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. దత్త కుమారుడు పత్తా లేకుండా పోయిన వేళ.. అంత్యక్రియల సందర్భంగా టీవీ స్క్రీన్ల మీదఒక బొద్దు కుర్రాడు కనిపించాడు.

అమ్మ నెచ్చెలి శశికళను ఫాలో అయి.. ఆమె చెప్పినట్లుగా నడుచుకున్న బొద్దుకుర్రాడు ఎవరు?అన్నది అందరిలోనూ ఆసక్తిని రేపింది. ఆ కుర్రాడు ఎవరన్న ఆరా తీస్తే.. అమ్మ అన్న కొడుకు దీపక్ అన్న విషయం బయటకు వచ్చింది. నిజానికి దీపక్ తండ్రి అమ్మ జయలలితతో కలిసిపోయెస్ గార్డెన్ లోనే ఉండేవారు. అనంతరం అమ్మతో ఏర్పడిన పేచీలతో ఆమెకు దూరంగా వెళ్లిపోయినట్లు చెబుతారు. అనంతరం ఆయన భార్య (జయలలిత వదిన) మరణించిన సమయంలో కూడా అమ్మ వారింటికి వెళ్లలేదు. అమ్మతో పెద్దగా సంబంధాలు లేనప్పటికీ.. అంతిమ సంస్కారాలకు దీపక్ ను తీసుకొచ్చారు. తనతో పాటు.. దీపక్ చేత అంతిమసంస్కారాల్ని చేయించారు శశికళ.

గతంలో ఇనుప వ్యాపారం చేసిన దీపక్.. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు చెబుతున్నారు. అమ్మ ఆసుపత్రిలో ఉన్నప్పుడు.. ఆమెను చూసేందుకు తనను అనుమతించాలంటూ దీప అనే మహిళ రచ్చ చేయటం తెలిసిందే. ఆ దీప ఎవరోకాదు.. అంత్యక్రియలప్పుడు బొద్దు కుర్రాడిగా అందరి దృష్టిలో పడిన దీపక్ సొంత సోదరే ఆమె. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ అమ్మ అసలుసిసలు వారసురాలు తానేనని చెప్పుకోవటం కనిపిస్తుంది. వారసత్వం అన్నది చెప్పుకుంటే వచ్చేయుదు కదా?