Begin typing your search above and press return to search.

అమ్మకు నేరుగా బర్త్ డే విషెస్ చెప్పే ఛాన్స్?

By:  Tupaki Desk   |   23 Feb 2016 4:41 AM GMT
అమ్మకు నేరుగా బర్త్ డే విషెస్ చెప్పే ఛాన్స్?
X
కొసరు పేరునే అసలు పేరు కంటే మిన్నగా వాడుకోవటం తమిళనాడు ‘అమ్మ’ జయలలితకు మాత్రమే సాధ్యమవుతుందేమో. అమ్మ పిలుపును బ్రాండ్ గా.. తన రాజకీయ ఎదుగుదలకు ఇష్టారాజ్యంగా వాడేసుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 68 పుట్టిన రోజుకు ఒక్కరోజే మిగిలి ఉంది. ఫిబ్రవరి 24న ఆమె బర్త్ డేను పురస్కరించుకొని.. అన్నాడీఎంకే నేతలు భారీ ఎత్తున వేడుకలు నిర్వహించాలని భావిస్తున్నారు.

ఎన్నికలకు మరికొద్ది నెలల్లో ముంచుకొస్తున్న నేపథ్యంలో.. అమ్మ బర్త్ డే వేడుకలను అంగరంగ వైభవంగా జరపటంతో పాటు.. అమ్మ కీర్తిని ఆకాశాన్నిఅంటేలా చాటాలని భావిస్తున్నారు. అమ్మ పుట్టినరోజును పురస్కరించుకొని ఆమెకు ఎవరైనా బర్త్ డే విషెస్ చెప్పేందుకు వీలుగా ఒక కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఇందుకోసం అన్నాడీఎంకేపార్టీ ఐటీవిభాగం రెండు ప్రత్యేక ఫోన్ లైన్లను ఏర్పాటు చేసింది.

ఈ నెంబర్లకు ఫోన్ చేసి.. 30 సెకన్ల పాటు అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే వీలు కల్పిస్తోంది. 0776702002, 044-33124234 నెంబర్లకు ఫోన్ చేసి అమ్మకు చెప్పాల్సిన బర్త్ డే విషెస్ ను చెప్పేయొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి వినూత్న ఆలోచనలు ప్రజల సంక్షేమం కోసం చేపడితే ఎంత బాగుండు..?