Begin typing your search above and press return to search.

మారణహోమం : జవాన్‌ కిడ్నాప్‌ - విడిపించాలని మోడీకి జవాన్ భార్య విన్నపం !

By:  Tupaki Desk   |   5 April 2021 12:30 PM GMT
మారణహోమం : జవాన్‌ కిడ్నాప్‌ - విడిపించాలని మోడీకి జవాన్ భార్య విన్నపం !
X
ఛత్తీస్ ‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన భద్రతా సిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 24 మంది జవాన్లు అసువులు బాశారు. మరో 30 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మరికొందరు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారి కోసం బీజాపూర్ అడవుల్లో భద్రతా దళాలు గాలిస్తున్నారు. అయితే శనివారం బీజాపూర్‌లో జరిగిన ఎదురు కాల్పుల గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టులు పక్కా ప్లాన్‌తోనే భద్రతా సిబ్బందిని ట్రాప్ చేసి చంపేసినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే .. పాటు మరో సీఆర్పీఎప్‌ జవాన్ కనిపించడం లేదు. కాల్పుల తర్వాత పలువురు జవాన్ల మృతదేహాలు లభించగా.. ఓ సీఆర్పీఎఫ్ జవాన్ ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ రోజు మరో ఇద్దరు జర్నలిస్టులకు మావోయిస్టుల నుంచి కాల్స్ వచ్చాయి. అదృశ్యమైన జవాన్‌ తమ చేతుల్లో బందీగా ఉన్నాడని వారు తెలిపారు. దీంతో ఆ జవాన్‌ ఆచూకీపై ఉత్కంఠ పెరుగుతోంది. సుక్మా, బీజపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో అదృశ్యమైన జవాన్ తమ వద్ద భద్రంగా ఉన్నారని, ఆయన ప్రాణాలకు ఎలాంటి హానీ తలపెట్టబోమని మావోయిస్టులు ఈ రోజు జర్నలిస్టులకు చెప్పినట్లు తెలుస్తోంది.

దీనితో ఈ వివరాలను వారు పోలీసులకు అందించారు. శనివారం మాద్వీ హిద్మా నేతృత్వంలోని దాదాపు 600 మావోయిస్టులు, వారి సానుభూతిపరుల బృందం టారెమ్‌ అడవుల్లో కూంబింగ్‌ చేస్తున్న జవాన్లను చుట్టుముట్టి కాల్పులకు దిగింది. ఇందులో 22 మంది జవాన్లు చనిపోయారు. మావోయిస్టులు పట్టుకున్న జవాన్ ‌ను రెండు, మూడు రోజుల్లో విడుదల చేస్తామని జర్నలిస్టులకు చెప్పారు. ఛత్తీస్‌ఘడ్‌ ఎన్‌ కౌంటర్‌ లో అదృశ్యమైన సీఆర్పీఎఫ్‌ జవాన్‌ ఆచూకీపై ఉత్కంఠ నెలకొంది. దీంతో ఆయన్ను కాపాడాలని భార్య ప్రధాని మోడీతో పాటు హోంమంత్ర అమిత్ ‌షా కూ నేడు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు ఆయన్ను అపహరించినట్లు జర్నలిస్టులకు ఫోన్‌ కాల్స్‌ చేసిన నేపథ్యంలో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ భార్య ప్రధాని, హోంమంత్రికి చేసిన విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే అదృశ్యమైన సీఆర్పీఎప్‌ జవాన్‌ ను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు సీఆర్పీఎఫ్‌ వర్గాలు వెల్లడించారు.

ఛత్తీస్ ‌గఢ్ ‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన జవాన్లలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ‌కు చెందినవారు ఉన్నారు. ఒకరు విజయనగరం పట్టణంలోని గాజులరేగకు చెందిన రౌతు జగదీష్‌ 2014లో సీఆర్‌పీఎఫ్‌-210 కోబ్రా దళంలో చేరారు. మరోకరు.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ ఆరేళ్ల క్రితం సైనిక దళంలో చేరారు. ప్రస్తుతం కోబ్రా-210 విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరు మావోయిస్టుల ఘాతుకానికి బలయ్యారు.