Begin typing your search above and press return to search.
'లో గ్రేడ్ మైండ్ సెట్ ఉన్న దున్నపోతు అఖిలప్రియ కు ఇదే వార్నింగ్'
By: Tupaki Desk | 18 May 2023 9:25 AM GMTనారా లోకేశ్ యువగళం పాదయాత్ర 102వ రోజున నంద్యాల జిల్లాలో చోటు చేసుకున్న వర్గపోరు సంచలనంగా మారటం తెలిసిందే. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వర్గం.. ఆమె ఎదుటే.. ఒకప్పుడు తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి పై పిడిగుద్దులు గుద్దుతూ.. ముక్కలో నుంచి రక్తం కారుతున్న షాకింగ్ ఉదంతం చోటు చేసుకోవటం తెలిసిందే. ఈ ఉదంతం పై బుధవారం బోలెడన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏవీ సుబ్బారెడ్డి పై దాడి ఉదంతంలో ఆమెను రిమాండ్ కు ఆదేశిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. దెబ్బలు తిన్న ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె కమ్ టీడీపీ నేత బొండా ఉమ కోడలైన జశ్వంతి తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా అఖిల ప్రియ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనకు బోలెడన్ని ఫోన్ కాల్స్.. మెసేజ్ లు వస్తున్నాయని.. తన తండ్రికి అంత సీరియస్ గా లేదని.. దెబ్బలు బలంగా తాకలేదని.. అంతా బాగానే ఉందని చెప్పిన ఆమె.. తన తండ్రి పై దాడి చేసింది అఖిలప్రియ గా చెప్పారు. ఆమె పైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
"భూమా నాగి రెడ్డి గారు చాలా పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పారు.. నేను.. ఏవీ సుబ్బారెడ్డి వేరు కాదని చెప్పి. అఖిల ను చిన్నప్పటి నుంచి నాన్న ఎత్తుకొని పెంచారు. తండ్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఈ రోజు ఆమె నిన్న దాడి చేయించింది. వంద రోజుల పాటు ప్రశాంతంగా జరుగుతున్న ప్రజాగళం యాత్రలో ఇలాంటి ఎటాక్ చేయించింది. కొంచమైనా ఆ బజారు మనిషి.. ఆ దున్నపోతు మద్దూరు అఖిలప్రియ కు కొంచమైనా బుద్ది ఉంటే.. ఎలాంటి టైంలో ఏం చేయాలన్న సెన్స్ ఉంటే ఇలా చేసేది కాదు" అని చెప్పారు.
తమ పై ఇదేమీ మొదటి ఎటాక్ కాదని.. ఇప్పటికి తమ మీద రెండు ఎటాక్స్ జరిగినట్లుగా జశ్వంతి వెల్లడించారు. "అందులో ఒకటి పార్టీ నిర్వహించిన సైకిల్ యాత్రలో.. పబ్లిక్ పోగ్రాంలో మా పై దాడి జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో మా ఇంట్లో మేం ఉంటే.. మా నాన్న ను చంపాలని మనుషుల్ని హైర్ చేసుకొని రెక్కి నిర్వహించింది. ఈ ఎటాక్స్ అన్నీ కూడా లో గ్రేడ్ మైండ్ సెట్ ఉన్న ఆ దున్నపోతు అఖిలప్రియ చేసింది. అయినా సరే.. చాలా కామ్ గా.. చిన్నప్పటి నుంచి ఆమెను నాన్న చూశాడన్న ఉద్దేశంతోనే ఉన్నాం. మేం చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నాం. మేం పార్టీని.. పోలీసుల్ని నమ్ముకొని చట్టప్రకారం నిర్ణయాలు తీసుకుంటున్నాం" అని వ్యాఖ్యానించారు.
తన తండ్రి విషయంలో అఖిల ప్రియ చేసిన దానికి తగిన ఫలితం అనుభవించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు జస్వంతి. ప్రతి సందర్భంలోనూ ఉమెన్ కార్డు చూపిస్తూ సింఫథీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లుగా జస్వంతి మండిపడ్డారు. "ప్రెస్ మీట్ లకు పిల్లాడి ని తీసుకురాకుండా.. సరిగ్గా అరెస్టు సమయంలో సంకలో పిల్లాడ్ని ఏసుకొని సింపథీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆమె ఏదైతే చేస్తుందో.. అందుకు తగిన శాస్తి తప్పదు. అఖిలప్రియ కు టికెట్ ఇస్తే.. తాను.. తన తండ్రి ఏవీ సుబ్బారెడ్డి.. ఏవీ వర్గం మొత్తం.. వచ్చే ఎన్నికల్లో అఖిల ప్రియ ను ఓడించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇంత క్లియర్ గా విషయాన్ని తేల్చేసిన నేపథ్యంలో విపక్ష టీడీపీ ఏ రీతిలొ రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.