Begin typing your search above and press return to search.

ట్రంప్ వర్సెస్‌ హిల్లరీ... బర్గర్ ఓటింగ్!

By:  Tupaki Desk   |   9 Oct 2016 4:41 AM GMT
ట్రంప్ వర్సెస్‌ హిల్లరీ... బర్గర్ ఓటింగ్!
X
కాదేదీ వ్యాపార అభివృద్ధికి అనర్హం అన్నట్లు భావించాడో ఏమో కానీ, అమెరికా అధ్యక్ష ఎన్నికలను తన బిజినెస్ పెంచుకోవడానికి అద్భుతంగా ఉపయోగించుకుంటుంది జపాన్ లోని ఓ కేఫ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టీ అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఉండటం... డెమోక్రటిక్‌ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్‌- రిపబ్లికన్ల తరఫున డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష స్థానం కోసం పోటీపడుతుండటం తెలిసిందే. వీరిలో ఎవరు విజయం సాధిస్తారనే విషయంపై వూహాగానాలు - సర్వేలు జోరుగానే సాగుతున్నాయి. కొందరు ట్రంప్‌ విజయం సాధిస్తారని అంటుంటే.. మరికొందరు హిల్లరీ గెలుఫు పక్కా అని ధీమాగా చెబుతున్నారు. ఈ హాట్ ఇష్యూని జపాన్‌లోని ఓ కేఫ్‌ మాత్రం తన బిజినెస్‌ పెంచుకోడానికి చక్కగా వాడుకుంటుంది.

"జేఎస్‌ బర్గర్‌ కేఫ్‌" జపాన్‌ రాజధాని టోక్యోలో ఉంది. ఈ జపాన్ కేఫ్ అమెరికా అద్యక్ష ఎన్నికల్లో ట్రంప్, హిల్లరీ లలో ఎవరు గెలుస్తారనే అంశంపై తన వినియోగదారులకు ఒక కొత్త రకం ఓటింగ్‌ నిర్వహిస్తోంది. ఈ మేరకు అధ్యక్ష అభ్యర్థులిద్దరి పేరునా రెండు రకాల బర్గర్లు తయారుచేసి పెట్టింది. వాటిలో ఆ రెండు బర్గర్ లనూ రుచి చూసి, ఏది బాగుందో చెప్పమని అడుగుతోంది. దీనికోసం హిల్లరీ స్వస్థలం చికాగో కాబట్టి అక్కడి ప్రఖ్యాత హాట్‌ డాగ్‌, పాపీ సీడ్‌ బన్‌లను తయారు చేయగా, న్యూయార్క్‌లో పుట్టిన ట్రంప్‌ పేరుతో న్యూయార్క్‌ డెలి శాండ్‌విచ్‌, రూబే, కరిగించిన చీజ్‌, రష్యన్‌ అలంకరణలతో చేసిన బర్గర్ ను ఏర్పాటు చేసింది.

ట్రంప్‌, హిల్లరీల స్వస్థలాల్లో ప్రాచుర్యంలో ఉన్న రుచులు, వంటకాల తీరును ఆధారం చేసుకుని తయారుచేస్తోన్న ఈ ఈ బర్గర్ లను రుచి చూసిన వినియోగదారులు తమ అభిప్రాయాలను అక్కడ వేర్వేరుగా ఏర్పాటుచేసిన బాక్స్‌ లో వేయాలి. ఈ ఓటింగ్ పూర్తయిన తర్వాత ఏ బర్గర్‌ కి ఎక్కువ ఓట్లు వస్తాయో లెక్కిస్తారు. దీనివల్ల కేవలం కేఫ్ కే లాభం అనుకునేరు... ఎందుకంటే చివర్లో ఒక లక్కీ డ్రా కూడా ఉంటుందండోయ్. ఆ లక్కీ టిప్ లో ఎంపికైన వారికి 365 రోజులపాటు ఆ కేఫ్‌ లో బర్గర్లను ఉచితంగా అందిస్తారు! దీంతో ఇప్పుడు టోక్యో వాసులు అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిస్తారు అనే విషయంపై కంటే... ఏ బర్గర్‌ రుచిగా ఉంది అనే విషయంపైనే ఎక్కువ చర్చోపచర్చలు నడుపుతున్నారట! దీంతో ఈ జపాన్ కేఫ్ వ్యాపార సూత్రం బాగానే వర్కవుట్ అవుతుందంట!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/