Begin typing your search above and press return to search.

వైరల్ ఇష్యూ: రేప్ పై నిర్వచనం మార్చుకుంటున్న జపాన్!

By:  Tupaki Desk   |   8 Jun 2023 9:00 PM GMT
వైరల్ ఇష్యూ: రేప్ పై నిర్వచనం మార్చుకుంటున్న జపాన్!
X
ఎవరైనా "వద్దు" అంటే... "వద్దు"అనే అర్ధం. పైగా ఒక ఆడిపిల్ల "వద్దు" అని అన్నదంటే... "అస్సలొద్దని" అర్ధం! అయితే ఈ "వద్దు" అనే పదం లైంగిక దాడుల్లో పరిగణలోకి తీసుకోవడం, తీసుకోకపోవడం అనే విషయాల్లో ఆ అమ్మాయి వయసు, ఆ సమయంలో అక్కడున్న పరిస్థితులు, ఆ సమయంలో ఆమె ఉన్న పరిస్థితి ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలనే రూల్స్ ఇప్పటివరకూ జపాన్ న్యాయవ్యవస్థలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ చట్టంలో మార్పుల దిశగా చర్చ నడుస్తుంది. బిల్లు పాసవ్వడమే తరువాయి!

జపాన్ దేశంలో ప్రస్తుతం ఈ చర్చ విపరీతంగా జరుగుతుంది. "రేప్" పై ప్రస్తుతం జపాన్ చట్టంలో ఉన్న లొసుగులు అక్కడి యువతులకు, బాలికలకు తీవ్ర సమస్యగా పరిణమిస్తున్నాయనే ఆరోపణలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన అనేక ఉదారహరణలు తెరపైకి వస్తున్నాయి. వీటన్నింటినీ పరిశీలించిన పిమ్మట... శతాబ్ధి కాలంలో ఒకటిరెండుసార్లు మాత్రమే సవరణకు నోచుకున్న చట్టంలో మరిన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉందనే చర్చ తీవ్రతరం అవుతుంది.

2014లో టోక్యోలో ఒక పురుషుడు 15 ఏళ్ల అమ్మాయితో బలవంతంగా సెక్స్ చేశాడు. ఆమె ఎంతగా ప్రతిఘటిస్తున్నా అతడు కొనసాగించాడు. అయితే ఈ విషయాలపై ఆ అమ్మాయి న్యాయ్స్థానాన్ని ఆశ్రయించింది. అతడు రేప్ చేసినట్లు ఆధారాలు కూడా సమర్పించింది. అయినా కూడా అతడికి కోర్టులో శిక్ష పడలేదు.

కారణం... అతడి చర్యలు "అడ్డుకోలేనంత కష్టమైనవి కాదు" అని న్యాయస్థానం అభిప్రాయపడటమే! ఇదే సమయంలో... జపాన్‌ లో సమ్మతి వయసు 13 ఏళ్లు కాబట్టి.. 15 ఏళ్ల అమ్మాయిని బాలికగా పరిగణలోకి తీసుకోలేమని, ఆమెను యువతిగా కోర్టు పరిగణించింది. ఫలితంగా ఆమె అతడిని అడ్డుకోవడంలో విఫలమయ్యిందనే అర్ధం ధ్వనించేలా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది!

ఫుకుయోకాలో జరిగిన ఒక కేసులో, మద్యం మత్తులో ఉన్న మహిళపై ఒక వ్యక్తి లైంగిక దాడికి పూనుకున్నాడు. అయితే ఆ సమయానికి ఆమె మద్యం సేవించి ఉంది. ఆ బార్ & రెస్టారెంట్‌ లో ఆమెపై ఒక వ్యక్తి లైంగిక దాడి చేశాడు. ఈ విషయం కూడా కోర్టుకెళ్లింది. ఆ సమయంలో కూడా అతడికి శిక్ష పడలేదు.

కారణం... "ఆ స్థలంలో లైంగిక కార్యకలాపాలు ఆమోదయోగ్యం కావడం వల్ల పురుషులు ఆ పని చేయవచ్చని భావించినట్టు" ఆ వ్యక్తి న్యాయస్థానానికి తెలిపాడు. పైగా తాను "ఆపని చేస్తున్నప్పుడు తనను ఎవరూ అడ్డుకోలేదని" అన్నాడు. ఇదే క్రమంలో... "సెక్స్ జరుగుతున్న సమయంలో ఆమె ఒకసారి కళ్లు తెరిచి చూసింది.. దీంతో ఆమె సమ్మతిగానే ఉన్నట్లు తాను భావించినట్లు" కోర్టుకు తెలిపాడు. కోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది.

ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే! ఇలాంటి సంఘటనలు జపాన్ లో సర్వసాదారణమే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా మెగుమి ఒకానో అనే అమ్మాయి వ్యక్తి కలిసి టీవీ చూస్తుండగా, అతను శృంగరానికి పూనుకున్నాడు. ఆమె వద్దని వారించినా వినకుండా అతడు ముందుకువెళ్లాడు. తరువాత ఆవ్యక్తి ఆమెపై దాడికి పూనుకున్నాడు. ఇద్దరూ కాసేపు పెనుగులాడారు. అనంతరం ఆమె నిస్సహాయులైపోయారు. అయినా కూడా ఆమె అతనిపై కేసు పెట్టలేదు. కారణం... ఆమెపై లైంగిక దాడి జరిగిందని స్పష్టంగా తెలుస్తున్నా... ఇది ప్రస్తుత చట్టం పరిధిలో నేరంగా రుజువుకాదనే నమ్మకం!!

దీంతో జపాన్ లోని పరిస్థితులపై తీవ్ర విమర్శలు రావడం మొదలయ్యాయి. దీంతో కొత్త చట్టాని రూపొందిస్తున్నారు జపాన్ న్యాయ కోవిధులు! ఇందులో భాగంగా... "అసమ్మతిని వ్యక్తపరచే విధానాన్ని తెలియజేసేవిగా" ఎనిమిది సందర్భాలను స్పష్టపరిచారు.

ఆ రూల్స్ ప్రకారం... మద్యం లేదా మాదకద్రవ్యాల మత్తులో ఉన్నప్పుడు.. హింస, బెదిరింపులు ఎదుర్కొన్నప్పుడు.. అచేతనంగా మారిపోయి ప్రతిఘటించలేనప్పుడు.. ఎదుటి వ్యక్తి తన "అధికారాన్ని" ఉపయోగించినప్పుడు ఒక మహిళపై లైంగిక దాడి జరిగితే అది "రేప్" కింద పరిగణలోకి తీసుకుంటారు. ఇదే క్రమంలో... సమ్మతి వయసును 16 ఏళ్లకు పెంచనున్నారు.

జూన్ 21 లోగా జపాన్ పార్లమెంటులో ఎగువసభ ఈ బిల్లును పాస్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా... ఈ చట్ట సంస్కరణలు రూపు దాల్చితే బాధితులకు, మార్పు కోరుకుంటున్నవారికి అది అపూర్వమైన విజయం అవుతుందనేది మాత్రం వాస్తవం!

ఈ సందర్భంలో ఈ చట్టం అమలులోకి వస్తే... తనకు జరిగిన అన్యాయంపై న్యాయస్థానానికి అప్పుడు వెళ్తానని మెగుమి ఒకానో చెప్పడం గమనార్హం!